నానిని బండ బూతులు తిట్టిన సాయి పల్లవి... ఎందుకు?

ఫిదా తరువాత సాయిపల్లవి ఒక రేంజ్‌కు పెరిగిపోయింది. కానీ కొత్తకొత్త సినిమాలకు కమిటయ్యే విషయంలో మాత్రం ఇప్పటికీ సాయిపల్లవి జాగ్రత్తగానే వ్యవహరిస్తోంది. రెమ్యునరేషన్ కంటే కథలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోంది. నిర్మాత దిల్ రాజు సినిమాల్లో నటిస్తే ఆ సినిమా భార

Webdunia
శనివారం, 23 సెప్టెంబరు 2017 (19:26 IST)
ఫిదా తరువాత సాయిపల్లవి ఒక రేంజ్‌కు పెరిగిపోయింది. కానీ కొత్తకొత్త సినిమాలకు కమిటయ్యే విషయంలో మాత్రం ఇప్పటికీ సాయిపల్లవి జాగ్రత్తగానే వ్యవహరిస్తోంది. రెమ్యునరేషన్ కంటే కథలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోంది. నిర్మాత దిల్ రాజు సినిమాల్లో నటిస్తే ఆ సినిమా భారీ విజయం సాధిస్తుందన్న నమ్మకం సాయి పల్లవిలో చాలా ఎక్కువగా ఉంది. మొదటి సినిమా ఫిదాతో తానేంటో నిరూపించుకుంది సాయి పల్లవి. మొదటి సినిమాతో మంచి సక్సెస్ ఇచ్చిన దిల్ రాజు అడగగానే ఎంసిఎ సినిమాలో నటించేందుకు ఒప్పుకుంది సాయి పల్లవి.
 
ఈ సినిమాలో హీరో నాని. ఇప్పటికే 70 శాతం సినిమా పనులు కూడా పూర్తయ్యాయి. అయితే కొన్ని రోజుల ముందు షూటింగ్ జరుగుతున్న సమయంలో నాని, సాయి పల్లవిల మధ్య చిన్న తగాదా వచ్చిందట. డైలాగ్‌ల విషయంలో నాని అలా చెప్పొద్దు.. ఇలా చెప్పు అని సాయి పల్లవికి చెప్పడంతో ఎలా చెప్పాలో నాకు తెలుసు. నువ్వు చెబితే తెలుసుకునేంత స్థితిలో నేను లేను అందట సాయి పల్లవి. ఒక్క సినిమాకే ఫోజులు బాగా ఎక్కువయ్యాయే.. ఇంకా సినిమాలు తీయాలమ్మా.. అంటూ నాని కూడా బాగానే స్పందించాడట. దీంతో సాయి పల్లవి బూతుల పురాణం మొదలుపెట్టిందట. 
 
సినిమా షూటింగ్ సమయంలో దిల్ రాజు లేకపోవడంతో అది కాస్త పెద్దదై సాయిపల్లవి, నానిలు షూటింగ్ మధ్యలోనే వెళ్ళిపోయారని టాలీవుడ్ సినీజనం చెప్పుకుంటున్నారు. రెండు రోజుల తరువాత దిల్ రాజు స్వయంగా నాని, సాయిపల్లవిలను కలిసి బుజ్జగించారట. కానీ సాయి పల్లవి మాత్రం వెనక్కి తగ్గలేదట. నాని మాత్రం కాస్త వెనక్కి తగ్గి సినిమా షూటింగ్ చేస్తానంటూ ఒప్పుకున్నాడట.

రెండు రోజుల తరువాత పల్లవి కూడా సినిమా షూటింగ్‌లో పాల్గొన్నదట. అయితే వీరి మధ్య ఇప్పటికీ మాటల యుద్థం కొనసాగుతూ ఉన్నట్లు సమాచారం. ఈ విషయాన్ని బయటకు పొక్కనీయొద్దంటూ సినిమా షూటింగ్ యూనిట్ అందరినీ దిల్ రాజు కోరాడని చెప్పుకుంటున్నారు. కానీ ఆ విషయం కాస్తా అలా.. అలా బయటకు వచ్చేసింది. ఇప్పుడు సినీపరిశ్రమలో వీరి గొడవే హాట్ టాపిక్‌గా మారింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలంగాణ వ్యాప్తంగా అన్ని చెక్ పోస్టులు రద్దు - అవినీతి అధికారులకు చెక్

వేరే వ్యక్తితో తల్లి అక్రమ సంబంధం: కన్నతల్లిని పరుగెత్తించి నరికి చంపిన కొడుకు

పాకిస్తాన్‌లో ఆకాశాన్నంటిన ధరలు.. కిలో టమోటాలు రూ.600, అల్లం రూ.750

బంగాళాఖాతంలో అల్పపీడనం: రెడ్ అలర్ట్.. రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు

భర్త పుట్టింటికి వెళ్లనివ్వలేదు.. కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్న మహిళ.. ఏమైంది?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments