Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఫిదాకు 50 రోజులు.. ఫేస్‌బుక్‌లో వరుణ్ తేజ్ ఫోటోలు

బాక్సాఫీసును షేక్ చేసిన ఫిదా సినిమా విజయవంతంగా 50 రోజులను పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా అర్థశతదినోత్సవ సంబరాలను సినీ యూనిట్ అట్టహాసంగా జరుపుకుంది. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలను హీరో వరుణ్ తేజ్ ఫ

Advertiesment
ఫిదాకు 50 రోజులు.. ఫేస్‌బుక్‌లో వరుణ్ తేజ్ ఫోటోలు
, సోమవారం, 4 సెప్టెంబరు 2017 (09:40 IST)
బాక్సాఫీసును షేక్ చేసిన ఫిదా సినిమా విజయవంతంగా 50 రోజులను పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా అర్థశతదినోత్సవ సంబరాలను సినీ యూనిట్ అట్టహాసంగా జరుపుకుంది. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలను హీరో వరుణ్ తేజ్ ఫేస్ బుక్‌లో పోస్ట్ చేశాడు. ఈ సినిమా నటీనటులతో పాటు టెక్నీషియన్స్, పలువురు ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొన్నారు. 
 
ఈ మూవీలో అమెరికా అబ్బాయిగా వ‌రుణ్ తేజ్ త‌న న‌ట‌న‌తో అద‌రగొట్ట‌గా, తెలంగాణ అమ్మాయిగా భానుమతి పాత్రలో సాయిపల్లవి ఆడియెన్స్‌ని ''ఫిదా'' చేసింది. శక్తకాంత్ అందించిన సంగీతం కూడా చాలా ప్లస్ అయ్యింది.

జూలై 21వ విడుదలైన ఈ సినిమా అన్నీ సెంటర్లలో బాక్సాఫీసు రికార్డులను బ్రేక్ చేసింది. వందరోజుల రేసులో దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో దర్శకుడు శేఖర్ కమ్ములతో సినీ యూనిట్ సెలబ్రేషన్ చేసుకుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

యువ హీరోపై మనసుపారేసున్న మలయాళ బ్యూటీ...