సాయి పల్లవి కోసం గంటా రవి ఒంటికాలిపై నిలబడ్డాడట... ఎందుకో తెలుసా?

ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో పదిలమైన స్థానాన్ని సంపాదించుకుంది సాయి పల్లవి. అయితే సాయి పల్లవి త్వరలో పెళ్ళి చేసుకునేందుకు సిద్ధమైందట. విదేశాల్లో ఈమధ్యే ఎం.బి.బి.ఎస్. పూర్తిచేసుకున్న సాయిపల్లవికి పెళ్ళి చేయాలని కుటుంబ సభ్యులు ఆలోచనలో ఉన్న

Webdunia
శనివారం, 26 మే 2018 (22:23 IST)
ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో పదిలమైన స్థానాన్ని సంపాదించుకుంది సాయి పల్లవి. అయితే సాయి పల్లవి త్వరలో పెళ్ళి చేసుకునేందుకు సిద్ధమైందట. విదేశాల్లో ఈమధ్యే ఎం.బి.బి.ఎస్. పూర్తిచేసుకున్న సాయిపల్లవికి పెళ్ళి చేయాలని కుటుంబ సభ్యులు ఆలోచనలో ఉన్నారట. అయితే సాయిపల్లవి మాత్రం మరో నాలుగేళ్ల పాటు తనకు వివాహం వద్దని కుటుంబ సభ్యులను ఒప్పించి ప్రస్తుతం సినిమాల్లో బిజీబిజీగా గడుపుతోంది. 
 
కానీ గత కొన్నిరోజుల ముందు ఎపి మంత్రి గంటా శ్రీనివాస్ కుమారుడు గంటా రవి సాయిపల్లవికి ఫోన్ చేసి పెళ్ళి చేసుకుందామని ప్రపోజ్ పెట్టాడట. గంటా రవి అంటే జయదేవ్ సినిమాతో పరిచయమైన వ్యక్తి. దీంతో సాయిపల్లవికి ఏం మాట్లాడాలో అర్థం కాలేదట. నాలుగేళ్ళ పాటు పెళ్ళి చేసుకోవడం ఇష్టం లేదని చెప్పేసిందట. దీంతో జయదేవ్ తన తండ్రి గంటా శ్రీనివాసరావు ద్వారా సాయిపల్లవి కుటుంబ సభ్యులతో మాట్లాడే ప్రయత్నం చేశారట. 
 
మంత్రి కుటుంబం కావడంతో పెళ్ళి ఇప్పుడే చేయలేము.. కాకుంటే నిశ్చితార్థం చేసుకుంటామని చెప్పారట. దీనికి సాయిపల్లవి కూడా అంగీకరించినట్లు తెలుస్తోంది. కానీ ఎప్పుడు నిశ్చితార్థం అనేది ఇప్పటివరకు రెండు కుటుంబాలు ఫిక్స్ చేసుకోలేదట. పెళ్ళి మాత్రం సాయిపల్లవినే చేసుకోవాలని గంటా రవి ఒంటికాలిపై నిలబడి ఉన్నాడట.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

దొంగలు కొట్టేస్తారని 25 తులాల బంగారాన్ని పాత దిండులో పెట్టింది, దాన్ని కాస్తా చెత్తలో పడేసారు...

కాస్త అలసటగా వుంది, బెడ్ పైన పడుకున్న ఎల్బీ నగర్ ఎస్సై, తెల్లారి నిద్ర లేపితే...

రీహాబిలిటేషన్-కేంద్రీకృత వికలాంగుల వాకథాన్‌ను నిర్వహించిన హెచ్ఏసిహెచ్ సువిటాస్

భద్రాద్రి రైల్వే స్టేషనులో బాంబు సంచిని కొరికిన కుక్క, పేలిపోయి ట్రాక్ మీద పడింది

Kavitha on AP Deputy CM: పవన్‌పై ఫైర్ అయిన కల్వకుంట్ల కవిత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

తర్వాతి కథనం
Show comments