Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్ఆర్ఆర్ టీమ్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారా? ఇది నిజమేనా? (video)

Webdunia
శుక్రవారం, 17 ఏప్రియల్ 2020 (23:18 IST)
యంగ్ టైగర్ ఎన్టీఆర్ - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ - దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్లో రూపొందుతోన్న భారీ బడ్జెట్ చిత్రం ఆర్ఆర్ఆర్. బాహుబలి తర్వాత రాజమౌళితో సినిమాలు చేయడానికి టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్స్ మాత్రమే కాకుండా బాలీవుడ్ బడా ప్రొడ్యూసర్స్ కూడా భారీ ఆఫర్స్ ఇచ్చారు. దీంతో రాజమౌళి తదుపరి చిత్రం ఏ బ్యానర్లో చేస్తాడో..? ఏ హీరోతో చేస్తాడో..? అని అందరూ ఆత్రతగా ఎదురు చూసారు. 
 
బాలీవుడ్ నుంచి బడా ఆఫర్స్ వచ్చినప్పటికీ... రాజమౌళి టాలీవుడ్ ప్రొడ్యూసర్ తోనే.. టాలీవుడ్ హీరోలతోనే సినిమా చేస్తుండడం విశేషం. హీరోలను చాలా పవర్‌ఫుల్‌గా చూపించే జక్కన్న ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్‌‌లను ఇంకెంత పవర్‌ఫుల్‌గా చూపించనున్నారో అనే క్యూరియాసిటీ ఏర్పడింది. అయితే.. అనుకున్న ప్రకారం షూటింగ్ జరగకపోవడం వలన 2020లో జులై 30న రిలీజ్ కావాల్సిన ఆర్ఆర్ఆర్ 2021లో జనవరి 8న రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. 
 
అయితే.. ఇప్పుడు కరోనా వలన షూటింగ్స్ ఆగిపోవడంతో మళ్లీ ఆర్ఆర్ఆర్ వాయిదా పడనున్నట్టు వార్తలు వస్తున్నాయి. చిత్ర యూనిట్ మాత్రం ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇదిలా ఉంటే... ఆర్ఆర్ఆర్ టీమ్ ప్రస్తుతం వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నట్టు తెలిసింది. అదేలా అంటే.. ఎన్టీఆర్, చరణ్‌ ఇంటిలో ఉండే డబ్బింగ్ చెబుతున్నారని తెలిసింది. రాజమౌళి వీడియో కాల్‌తో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌లో సూచనలు ఇస్తున్నారని.. ఈ విధంగా ఆర్ఆర్ఆర్ టీమ్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తుందని మీడియాలో వార్తలు వస్తున్నాయి. 
 
దీనిని బట్టి తెలిసింది ఏంటంటే... రాజమౌళి ఎట్టి పరిస్థితుల్లోను ఆర్ఆర్ఆర్ రిలీజ్‌ను వాయిదా వేయాలనుకోవడం లేదని. అయితే... గ్రాఫిక్స్ వర్క్‌ని ఇండియాలోనే కాకుండా విదేశాల్లో కూడా వర్క్ చేయించాల్సి ఉండటంతో రిలీజ్ డేట్ పైన అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రస్తుతం ఏర్పడిన పరిస్థితులు చక్కబడిన తర్వాత రాజమౌళి ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి పూర్తి డీటైల్స్ తెలియచేస్తారని తెలిసింది. అప్పుడు రిలీజ్ డేట్ పైన క్లారిటీ వస్తుంది. మరి.. రాజమౌళి ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టి రిలీజ్ డేట్ పైన క్లారిటీ ఇస్తారో చూడాలి.

 

సంబంధిత వార్తలు

వైఎస్ జగన్ అనే నేను... జూన్ 9న ఉదయం 9.38 గంటలకు విశాఖలో ప్రమాణ స్వీకారం...

పోస్ట్ పోల్ సర్వే.. టీడీపీ కూటమి విజయం.. వైకాపాకు ఆ ప్రాంతాల్లో పట్టు

ఒకవైపు ఓడిపోతున్నా, చివరి రౌండ్ల వరకూ చూడంటారు, హహ్హహ్హ: ప్రశాంత్ కిషోర్

చీరకట్టులో స్పోర్ట్స్ ‌బైకుపై దూసుకెళ్లిన వరంగల్ ఆంటీ ... అవాక్కమైన మగరాయుళ్లు!! (Video Viral)

ఛత్తీస్‌గఢ్‌లో లోయలోపడిన వాహనం - 17 మంది మృతి

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments