Webdunia - Bharat's app for daily news and videos

Install App

'గుప్పెడంత మనసు'కి రిషి గుడ్ బై? చేతులు జోడించి బ్రతిమలాడుతున్న వసుధర

Webdunia
గురువారం, 14 డిశెంబరు 2023 (11:27 IST)
ఫోటో కర్టెసీ- ఇన్‌స్టాగ్రాం
స్టార్ మా ఛానల్లో బాగా ఆదరణ వున్న సీరియల్లో గుప్పెడంత మనసు సీరియల్ ఒకటి. ఈ సీరియల్లో అనుకోకుండా కొన్ని పాత్రలను కీలక మలుపు తిప్పేస్తున్నారు. ఇప్పుడు తాజాగా మరో మలుపు తిప్పుతున్నారా అని సీరియల్ అభిమానులు చర్చించుకుంటున్నారు. మూడు వారాలుగా సీరియల్ హీరో అయిన రిషి కనిపించకుండా పోయాడు. ఆచూకి లేదని అటు మహేంద్ర, ఇటు పోలీస్ ఆఫీసర్ ముకుల్ తలలు పట్టుకుంటున్నారు. మరోవైపు వసుధర ఏమో నేరుగా శైలేంద్ర వద్దకెళ్లి చేతులు జోడించి రిషి ఆచూకి చెప్పవా అని బ్రతిమలాడుతోంది.
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by MUKESH (@_mukesh_gowda5)

దానికి శైలేంద్ర... రిషి జీవించి వున్నాడో లేదంటే పైలోకాలకు వెళ్లాడో తెలియదని రెచ్చగొడుతున్నాడు. దీనితో వసుధర కన్నీళ్లు పెట్టుకుంటూ అతడిని బ్రతిమలాడుతోంది. ఈ వరస చూస్తుంటే గుప్పెడంత మనసు సీరియల్ నుంచి రిషి కూడా జంప్ అయ్యాడేమోనన్న అనుమానాలు వస్తున్నాయి. ఇప్పటికే రిషి(ముఖేష్ గౌడ్)కి సినిమా అవకాశం వచ్చింది. దీనికి సంబంధించి ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేసారు. ఆ ప్రకారం చూస్తే... అతడు సినిమాల్లో బిజీ అవడం వల్లే అతడి పాత్రను ఇలా కనిపించడంలేదంటూ సాగదీస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. మరీ 3 వారాలుగా సాగిదీస్తుండటంతో సీరియల్ పైన చాలామంది పెదవి విరుస్తున్నారు. ఇంకా లాగితే సీరియల్ టెంపో మిస్సవుతుందేమనన్న వాదన కూడా వినిపిస్తోంది.
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Jyothi Rai (Jayashree Rai) (@jyothiraiofficial)

కొన్ని వారాల కిందట సీరియల్లో రిషి తల్లి జగతి క్యారెక్టర్ జగతిని హఠాత్తుగా చంపేసారు. ఆమె రిషిని కాపాడే క్రమంలో బుల్లెట్ తగిలి ఆసుపత్రి పాలవుతుంది. ఆ తర్వాత ఇంటికి వచ్చిన ఆమెకి పండ్ల రసంలో విషం కలిపి చంపేస్తారు దేవయాని, శైలేంద్ర. వాస్తవానికి ఈ సీరియల్ నుంచి జగతి ఫేమ్ జ్యోతిరాయ్ బయటకు వెళ్లిపోయింది. ఆమెకి బాలీవుడ్ సినిమా ఆఫర్లు రావడంతో సీరియల్లో నటించనని చెప్పడంతో ఆమె పాత్రను అలా కటాఫ్ చేసారు. ఇప్పుడు రిషి పాత్రను కూడా అలాగే చేస్తారనే టాక్ వినిపిస్తోంది. మరి ఇది కేవలం ఊహాగానామేనా లేదంటే రిషి క్యారెక్టర్‌ను మళ్లీ రప్పిస్తారా చూడాల్సిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పోసాని కృష్ణ మురళికి బెయిల్ మంజూరు చేసిన గుంటూరు కోర్టు

Navy Officer Murder Case: వెలుగులోకి షాకింగ్ నిజాలు.. మృతదేహంపైనే నిద్ర..

అమరావతిలో అతిపెద్ద అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం... కేశినేని శివనాథ్

Hyderabad Road Accident: ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో అడిషనల్ డీఎస్పీ మృతి

Hailstorm: తెలంగాణలో తీవ్రమైన వడగళ్ల వానలు.. తీవ్ర నష్టం.. దెబ్బతిన్న మామిడి తోటలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments