Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమితాబ్‌తో కలిసి బ్యాంక్ దోపిడి చేయనున్న రెజీనా...

హాట్ బ్యూటీ రెజీనా స్టార్ డమ్ కోసం చాలా కాలం నుండి తెగ ప్రయత్నాలు చేస్తోంది. అందాలను ఒలకబోస్తున్నా కూడా చిన్నహీరోల సరసనే అవకాశాలు వస్తున్నాయి కానీ...అగ్ర హీరోల సరసన ఆఫర్స్ దక్కడం లేదు. అయితే ఇప్పుడీ భ

Webdunia
గురువారం, 18 ఆగస్టు 2016 (17:10 IST)
హాట్ బ్యూటీ రెజీనా స్టార్‌డమ్ కోసం చాలాకాలం నుండి తెగ ప్రయత్నాలు చేస్తోంది. అందాలను ఒలకబోస్తున్నా కూడా చిన్నహీరోల సరసనే అవకాశాలు వస్తున్నాయి కానీ...అగ్ర హీరోల సరసన ఆఫర్స్ దక్కడం లేదు. అయితే ఇప్పుడీ భామకి బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ సరసన నటించే అవకాశం లభించింది. ఎస్ఎంఎస్ చిత్రంతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ తెలుగు, తమిళ భాషలలో వైవిధ్యమైన సినిమాలలో నటించి మంచి పేరును సంపాదించుకుంది.
 
 ప్రస్తుతం కృష్ణవంశీ తెరకెక్కిస్తోన్న''నక్షత్రం'' చిత్రంతో పాటు శ్రీనివాస అవసరాల చిత్రం ''జో అచ్యుతానంద''లో నటిస్తున్న రెజీనా బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ దక్కడంతో ఎగిరిగంతేస్తోంది. 2002లో విడుదలైన బాలీవుడ్ చిత్రం 'ఆంఖేన్' కి సీక్వెల్ తెరకెక్కుతోంది, తొలి భాగంలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, అక్షయ్ కుమార్, అర్జున్ రాంపాల్, సుస్మితాసేన్ నటించారు. ఈ సీక్వెల్‌లో అమితాబ్ బచ్చన్ నటిస్తున్నారు. అక్షయ్ కుమార్ పాత్రలో జాన్ అబ్రహాం నటిస్తున్నారు.
 
ఈ చిత్రంలో రెజీనా నెగెటివ్ షేడ్ పాత్ర పోషించనుంది. ఇక ఈ సినిమాలో ఇప్పటికే ఇలియానాను ఒక హీరోయిన్‌గా తీసుకున్నారు. ఈ సినిమా చాలా థ్రిల్లంగ్‌గా ఉంటుందట. ఈ సీక్వెల్‌లో జైలు నుంచి బయటికి వచ్చిన అమితాబ్ బ్యాంక్ దోపిడీకి ప్లాన్ చేస్తారట. ఈ దోపిడికి రెజీనా, జాన్ అబ్రహాంల సహాయం కూడా అమితాబ్‌కి దక్కుతుందట. టాలీవుడ్ నుండి బాలీవుడ్‌లో నటించే అవకాశాన్ని దక్కించుకున్న రెజీనాకి ఈ సినిమా మరిన్ని అవకాశాలు తెచ్చి పెడుతుందేమో వేచి చూద్దాం.
అన్నీ చూడండి

తాజా వార్తలు

GOs in Telugu : తెలుగు భాషలో ప్రభుత్వ జీవోలు.. భాషాభిమానుల హర్షం.. బాబుపై ప్రశంసలు

గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని రద్దు చేసిన ఏపీ సర్కారు

కుట్లు వేయడానికి బదులుగా ఫెవిక్విక్‌‌ను పూసిన నర్సు.. సస్పెండ్ అయ్యిందిగా

ఢిల్లీ ఎన్నికలు: ఎగ్జిట్ పోల్స్ ఏమంటున్నాయి...? బీజేపీదే హవా-ఆప్‌కే గెలుపంటున్న కేకే సర్వే!

ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆరోగ్య సమస్య ఏంటి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో జలుబు, ఈ చిట్కాలతో చెక్

ఉదయం నిద్ర లేచింది మొదలు నిద్రకు ఉపక్రమించే దాకా

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా విజయవాడ మణిపాల్ హాస్పిటల్స్ భారీ అవగాహన కార్యక్రమం

క్యాన్సర్ వ్యాధిని తగ్గించగల 8 ఆహారాలు

పిల్లల కడుపుకు మేలు చేసే శొంఠి.. ఎలాగంటే..?

తర్వాతి కథనం
Show comments