Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెజీనా దశ-దిశ తిరగనుందా, ఆ ఒక్క సినిమాతో..?

Webdunia
మంగళవారం, 27 జులై 2021 (20:54 IST)
అల్లుడు శ్రీను పేరు వింటేనే హీరో బెల్లంకొండ శ్రీనివాస్ గుర్తుకు వస్తారు. యంగ్, డైనమిక్, ఎనర్జిటిక్ హీరోగా పేరు సంపాదించారు ఈయన. ప్రస్తుతం బాలీవుడ్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారట. 
 
పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ఛత్రపతి సినిమాను రీమేక్ చేస్తున్నారు. రీసెంట్‌గా కొబ్బరికాయ కొట్టి షూటింగ్ స్టార్ట్ చేసిన ఈ హీరో తాజాగా ఈ సినిమా కోసం ఒక క్రేజీ హీరోయిన్‌ను లైన్లో కూడా పెట్టారట.
 
ఇప్పుడు ఇదే విషయం వైరల్‌గా మారుతోంది. నిన్నమొన్నటి వరకు ఈ సినిమాలో హీరోయిన్ ఎవరన్నది ఆశక్తికరంగా మారంది. మొదటగా శ్రీదేవి కూతురు జాన్వీకపూర్ హీరోయిన్‌గా నటిస్తారన్న ప్రచారం ఎక్కువగా సాగింది.
 
ఆ తరువాత బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ దాదాపు ఖరారయ్యారన్న న్యూస్ కూడా చక్కర్లు కొట్టింది. అయితే లేటెస్ట్ బజ్ ప్రకారం కియారా డేట్స్ దొరక్కపోవడంతో ఆమె ప్లేస్‌లో రెజీనాను ఫిక్స్ చేశారట మూవీ మేకర్స్.
 
ఆ మధ్యన తెలుగులో వరుస సినిమాలు చేసిన రెజీనా ఆ తరువాత తమిళ సినిమాల్లో నటించి మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. 2018లో ఒక హిందీ చిత్రంలో నటించి అక్కడ కూడా గుర్తింపు కూడా తెచ్చుకున్నారట. ఇక ఛత్రపతి రీమేక్‌తో మరోసారి బాలీవుడ్ ప్రేక్షకులను అలరించడానికి సిద్థమవుతున్నారట. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాకిస్థాన్ సైన్యంలో తిరుగుబాటు : ఆర్మీ చీఫ్‌కి జూనియర్ల వార్నింగ్

తిరుపతిలో వ్యర్థాలను ఏరుకునే వారి కోసం ట్రాన్స్‌ఫర్మేటివ్ ప్రాజెక్ట్

Praveen Kumar: పాస్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ మరణానికి ఏంటి కారణం?

Bhadrachalam: భద్రాచలంలో ఆరు అంతస్థుల భవనం కుప్పకూలింది: శిథిలాల కింద ఎంతమంది? (video)

పాస్‌పోర్ట్ మరిచిపోయిన పైలెట్... 2 గంటల జర్నీ తర్వాత విమానం వెనక్కి!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments