Webdunia - Bharat's app for daily news and videos

Install App

బన్నీ దూకుడు తట్టుకునేందుకు ఇంట్లో వర్కౌట్ల్ చేస్తున్న రష్మిక

Webdunia
శనివారం, 18 ఏప్రియల్ 2020 (18:09 IST)
'గీత గోవిందం' తర్వాత 'సరిలేరు నీకెవ్వరు' చిత్రం విజయంతో రష్మిక మందన్నా మళ్లీ ఫామ్‌లోకి వచ్చిందని చెప్పొచ్చు. దీంతో ఆమెను తమ చిత్రాల్లో ఎంపిక చేసుకునేందుకు దర్శకనిర్మాతలతో పాటు హీరోలు కూడా ఆసక్తి చూపుతున్నారు. 
 
ఈ నేపథ్యంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ - లెక్కల మాస్టరుగా పేరుగాంచిన డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఓ మూవీ తెరకెక్కనుంది. ఈ చిత్రానికి "పుష్ప" అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో పీరియాడిక్ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కనుంది. 
 
ఈ సినిమా కోసం బన్నీ చాలా కష్టపడుతున్నాడు. తన లుక్‌ను పూర్తిగా మార్చుకున్నాడు. అలాగే ఓ టీచర్‌ను పెట్టుకుని చిత్తూరు యాస నేర్చుకుంటున్నాడు. ఈ చిత్రంలో హీరోయిన్‌గా రష్మిక మందన్నాను ఎంపిక చేశారు. 
 
దీంతో బన్నీకి ధీటుగా నటించేందుకు వీలుగా ఆమె కూడా లాక్‌డౌన్ సమయంలో హోం వర్కౌట్స్ చేస్తోందట. మొదటి నుంచి రష్మిక సొంతంగానే డబ్బింగ్ చెప్పుకుంటోంది. ఈ సినిమాకు కూడా రష్మిక తన గొంతునే వినిపించాలని ఫిక్స్ అయిందట. అందుకే రష్మిక కూడా ప్రత్యేకంగా చిత్తూరు యాస నేర్చుకుంటోందట. 
 
ప్రస్తుతం లాక్‌డౌన్ కారణంగా ఖాళీ సమయం లభించడంతో చిత్తూరు యాసను పక్కాగా నేర్చుకునే పనిలో రష్మిక బిజీగా ఉందట. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానున్న ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్‌ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రానన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆస్తి కోసం కన్నతండ్రిని చంపేసిన కిరాతక తనయుడు

Man: మార్నింగ్ వాక్ చేస్తున్న వ్యక్తిని కాల్చి చంపేశారు..

వివాదంలో మెగాస్టార్ చిరంజీవి నివాసం... హైకోర్టు కీలక ఆదేశాలు

కారును అద్దెకు తీసుకుని సినీ ఫక్కీలో భర్తను హత్య చేసిన భార్య... ఎక్కడ?

కుటుంబ వివాదాలు.. భర్తను హత్య చేసి ఇంటి ఆవరణలో పాతిపెట్టిన భార్య!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

శ్వాసనాళ సంబంధ వ్యాధులకు కారణమయ్యే రెస్పిరేటరీ సింశైషియల్ వైరస్‌పై అవగాహన, టీకాల అవసరం

తర్వాతి కథనం
Show comments