Webdunia - Bharat's app for daily news and videos

Install App

''సాఫ్ట్‌వేర్ సుధీర్''లో రష్మీ గౌతమ్‌నే అనుకున్నారు.. కానీ?

Webdunia
శుక్రవారం, 8 నవంబరు 2019 (10:40 IST)
''సాఫ్ట్‌వేర్ సుధీర్'' సినిమాలో రష్మీ గౌతమ్ నటించాల్సింది. కానీ డేట్స్ సర్దుబాటు కాని కారణంగా రష్మీతో చేయడం కుదరలేదు. దీంతో హీరోయిన్‌గా ధన్య బాలకృష్ణన్ తీసుకున్నట్లు సాఫ్ట్‌వేర్ సుధీర్ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సుడిగాలి సుధీర్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించాడు.
 
జబర్దస్త్ హాస్య నటుడు సుడిగాలి సుధీర్ 'సాఫ్ట్‌వేర్ సుధీర్' అనే చిత్రం ద్వారా హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ సినిమాలో ఆయన సరసన హీరోయిన్‌గా రాజుగారి గది ఫేమ్ ధన్య బాలకృష్ణన్ నటిస్తోంది. కానీ తొలుత హీరోయిన్ కోసం రష్మీని సంప్రదించారు. కానీ డేట్స్ అడ్జెస్ట్ కాలేకపోవడంతో ఆమె ఈ సినిమాకు నో చెప్పిందని సుధీర్ వెల్లడించాడు. 
 
కాగా, రాజశేఖర్‌ రెడ్డి పులిచర్లని దర్శకుడిగా,శేఖర ఆర్ట్స్‌ క్రియేషన్స్‌ పతాకంపై పారిశ్రామికవేత్త కె.శేఖర్‌ రాజు ఈ సినిమాను నిర్మించారు. డిసెంబర్ మొదటివారంలో సినిమా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. సాఫ్ట్‌వేర్ నేపథ్యంలో వినోదాత్మకంగా సాగే కమర్షియల్ చిత్రమిది అని రాజశేఖర్ రెడ్డి తెలిపారు. ఈ సినిమాలో సుధీర్ పవన్ కల్యాణ్, రజనీకాంత్‌లను అనుకరించడం హైలైట్‌గా నిలుస్తుందని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీలో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు... ఐఎండీ హెచ్చరిక

మూడు రోజుల క్రితం వివాహం... రౌడీ షీటర్ నడి రోడ్డుపై హత్య

క్షేమంగా ఇంటికి చేరుకున్న మార్క్.. శ్రీవారికి తలనీలాలు సమర్పించిన అన్నా లెజినోవా

ప్రియురాలి భర్తను చంపేందుకు సుపారీ గ్యాంగ్‌తో కుట్ర... చివరకు...

30 రోజులకు మించి ఉంటున్నారా? అయితే తట్టాబుట్టా సర్దుకుని వెళ్లిపోండి.. అమెరికా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments