Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాజల్ ఆ ముగ్గురికి పార్టీ ఇచ్చింది.. ఇంటికి గెస్ట్‌లు వచ్చారని ట్వీట్ చేసింది.. కాకాపట్టడానికేనా?

సినిమాలో అవకాశాలు రావడమే అదృష్టం. కెరీర్ ఇలా నత్తనడకగా సాగుతున్న టైమ్‌లో సినిమాలు విజయం సాధించలేకపోయినా పర్వాలేదుగానీ... కనీసం యావరేజ్‌గా అయినా ఆడితే బాగుంటుందని ఏ హీరోయిన్ అయినా కోరుకుంటుంది. కాజల్ క

Webdunia
గురువారం, 3 నవంబరు 2016 (15:02 IST)
సినిమాలో అవకాశాలు రావడమే అదృష్టం. కెరీర్ ఇలా నత్తనడకగా సాగుతున్న టైమ్‌లో సినిమాలు విజయం సాధించలేకపోయినా పర్వాలేదుగానీ... కనీసం యావరేజ్‌గా అయినా ఆడితే బాగుంటుందని ఏ హీరోయిన్ అయినా కోరుకుంటుంది. కాజల్ కూడా అలానే కోరుకుంది. తన తాజా సినిమాల్లో కనీసం ఒక్కటైనా హిట్ అవ్వాలని వెయ్యి దేవుళ్లకు మొక్కుకుంది. కానీ దేవుడు కరుణించలేదు. 
 
పవన్‌తో కలిసి కాజల్ చేసిన సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రం పరాజయం పొందింది. ఈ సినిమా ఇంత ఫ్లాప్ అవుతుందని ఎవరూ కలలో కూడా ఊహించనే లేదు. ఎవరికైనా లోలోపల మనసులో అనుమానాలు ఉన్నప్పటికీ… యావరేజ్‌గానైనా గట్టెక్కుతుందని భావించారు. కానీ సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా ఆల్ టైం డిజాస్టర్స్ మూవీల్లో ఒకటిగా చేరిపోయింది. అటు మహేష్ నటించిన బ్రహ్మోత్సవం కూడా ఏమాత్రం తీసిపోలేదు. ఇది కూడా ఆల్ టైం డిజాస్టర్స్ మూవీల్లో ఒకటిగా మారిపోయింది. దీంతో ఈ సీజన్‌లోనే అతిపెద్ద ఫ్లాప్ హీరోయిన్‌గా కాజల్ పేరు సంపాదించుకుంది. 
 
కాగా ఇప్పుడీ భామ చిరంజీవి స‌ర‌స‌న ఖైదీ నెంబ‌ర్ 150తోపాటు రానాతో క‌లిసి తేజ ద‌ర్శ‌క‌త్వంలో ఓ పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్ సినిమాలో నటిస్తోంది. ఖైదీ నెంబ‌ర్ 150స‌మ్మ‌ర్ కానుక‌గా రిలీజ్‌కి రెడీ అవుతుండ‌గా, తేజ డైరెక్ష‌న్‌లోని మూవీ ఫిబ్ర‌వ‌రిలో విడుదల కానుందని సినీవర్గాలు అంటున్నాయి. ఎప్పుడూ కెరీర్ విష‌యాల‌నే సోషల్ మీడియాలో పంచుకునే అమ్మడు తాజాగా త‌న ప‌ర్స‌న‌ల్ విష‌యాల‌ను కూడా ట్విట్ట‌ర్‌లో షేర్ చేసుకుంటోంది.
 
తాజాగా... హీరో రానా, ఆయ‌న తండ్రి సురేష్ బాబు, దర్శకుడు తేజని త‌న ఇంటికి ఆహ్వానించింది. అక్క‌డ వారికి చిన్న పార్టీ కూడా ఇచ్చింద‌ట‌. ఇలా, కాజ‌ల్ న‌టిస్తున్న తేజ సినిమాలో ఈ ముగ్గురి భాగ‌స్వామ్యం ఉండ‌డంతో.. పిలిచి ఇలా ట్రీట్ ఇచ్చింద‌ట కాజల్. అంతేకాదు... త‌న ఇంటికి స్పెష‌ల్ గెస్ట్‌లు వ‌చ్చార‌ని ట్వీట్ చేసింది. ఇదంతా ఆ ముగ్గురిని కాకా పట్టడానికేనని సినీజనాలు గుసగుసలాడుకుంటున్నారు.

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

ఏంటి.. టీడీపీ ఏజెంటుగా కూర్చొంటావా.. చంపేసి శవాన్ని పోలింగ్ కేంద్రానికి పంపితే దిక్కెవరు?

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

నల్లద్రాక్షను తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments