Webdunia - Bharat's app for daily news and videos

Install App

దగ్గుబాటి రానా చేతిలో తాప్సీ కెరీర్.. ఘాజీ నుంచి స్టార్ట్...

తాప్పీ... ఈ సొట్టబుగ్గల సుందరి టాలీవుడ్‌లో ఐరెన్ లెగ్‌గా ముద్ర వేయించుకుంది. దీంతో తెలుగులో అవకాశాలు లేక బాలీవుడ్ బాటపట్టింది. అక్కడ 'బేబీ', 'పింక్' వంటి చిత్రాల్లో నటించింది. ఈ రెండు చిత్రాలు ఆమెకు మ

Webdunia
సోమవారం, 30 జనవరి 2017 (14:23 IST)
తాప్పీ... ఈ సొట్టబుగ్గల సుందరి టాలీవుడ్‌లో ఐరెన్ లెగ్‌గా ముద్ర వేయించుకుంది. దీంతో తెలుగులో అవకాశాలు లేక బాలీవుడ్ బాటపట్టింది. అక్కడ 'బేబీ', 'పింక్' వంటి చిత్రాల్లో నటించింది. ఈ రెండు చిత్రాలు ఆమెకు మంచి పేరు తెచ్చిపేటాయి. ఈ పరిస్థితుల్లో టాలీవుడ్ హీరో దగ్గుబాటి రానా మనసు తాప్సీపై పడింది. అంతే తన సిఫార్సు మేరకు తాను హీరోగా నటించిన "ఘాజీ" చిత్రంలో హీరోయిన్‌గా తాప్సీకి అవకాశం ఇప్పించాడు. 
 
రానా రిఫరెన్స్ వల్లనే ఆమెని తీసుకొన్నారని చెప్పుకొన్నారు. ఈ మాటలు తాప్సీ చెవిన కూడా పడ్డాయి. దీంతో ఈ వ్యాఖ్యలపై తాప్సీ స్పందించింది. రానా నాకు మంచి స్నేహిటు. అయితే, ఘాజీ కోసం తనని సిఫార్సు చేశాడన్న వార్తల్లో నిజం లేదని తెలిపింది. కానీ రానా మాత్రం తాప్సీపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ మరికొంతమంది నిర్మాతలకు కూడా తాప్సీ పేరును సిఫార్సు చేసినట్టు తెలుస్తోంది. 
 
కాగా, రానా, తాప్సీ జంటగా నటించిన చిత్రం ఘాజి. ఈ చిత్రం 1971లో జరిగిన ఇండియా - పాకిస్థాన్ వార్.. 'జలాంతర్గామి' నేపథ్యంలో తెరకెక్కింది. సంకల్ప్ రెడ్డి దర్శకుడు. రానా నేవీ ఆఫీసర్‌గా కనిపిస్తాడు. ఫిబ్రవరి 17న ఘాజీ ప్రేక్షకుల ముందుకు రానుంది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

కృష్ణానది ఒడ్డున భారీ క్రీడా నగరం.. పెదలంక - చిన్నలంక గ్రామాల పరిసరాల్లో..?

హైదరాబాద్‌లో గ్లోబల్ కెపబిలిటీ సెంటర్‌: కాగ్నిజెంట్‌తో సిటిజన్స్ ఫైనాన్షియల్ గ్రూప్ భాగస్వామ్యం

ఆర్థిక వృద్ధి రేటు.. రెండో స్థానానికి చేరిన ఆంధ్రప్రదేశ్.. చంద్రబాబు హర్షం

మద్యం కుంభకోణం- రూ.18,860 కోట్ల నష్టం: విజయసాయి రెడ్డికి నోటీసులు జారీ

అలా చేస్తే పాఠశాలల గుర్తింపు రద్దు చేస్తామంటున్న ఢిల్లీ సీఎం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

తర్వాతి కథనం
Show comments