Webdunia - Bharat's app for daily news and videos

Install App

'నిజమైన కత్తికన్నా మెగా షార్ప్ ట్రైలర్‌గా గౌతమిపుత్ర ట్రైలర్.. అసూయపుట్టిందంటున్న రాంగోపాల్ వర్మ

ఏ చిన్నపాటి అవకాశం లభించినా మెగా కాంపౌండ్‌పై విమర్శలు గుప్పించే వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ. ఇపుడు ఆయనకు మరో అవకాశం లభించింది. శుక్రవారం విడుదలైన 'గౌతమీపుత్ర శాతకర్ణి' ట్రైలర్‌ను మెగా కాంపౌండ్‌

Webdunia
శనివారం, 17 డిశెంబరు 2016 (10:56 IST)
ఏ చిన్నపాటి అవకాశం లభించినా మెగా కాంపౌండ్‌పై విమర్శలు గుప్పించే వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ. ఇపుడు ఆయనకు మరో అవకాశం లభించింది. శుక్రవారం విడుదలైన 'గౌతమిపుత్ర శాతకర్ణి' ట్రైలర్‌ను మెగా కాంపౌండ్‌కు షాక్ ఇచ్చే అస్త్రంగా మలుచుకున్నారు. బాలయ్య 'శాతకర్ణి' ట్రైలర్ చూసి ఫిదా అయిపోయినట్టు వర్మ ట్వీట్ చేశాడు. 
 
అంతేనా.. 'నిజమైన కత్తికన్నా మెగా షార్ప్ ట్రైలర్‌గా క్రిష్ "గౌతమిపుత్ర శాతకర్ణి" కనిపిస్తోంది' అంటూ వర్మ ట్విట్ చేశాడు. పైగా, ఈ ట్రైలర్‌ను చూశాక తనకే అసూయ కలిగిందని చెప్పుకొచ్చాడు. అయితే శాతకర్ణి ట్రైలర్‌ను పొగడoలో ఆశ్చర్యం లేదు కానీ తన ట్విట్‌లో వాడిన పదాల మధ్య వర్మ కత్తి ప్రస్తావన ఎందుకు తీసుకు వచ్చాడు అన్న కామెంట్స్ ఫిల్మ్ నగర్‌లో చర్చకు దారితీశాయి. 
 
అంతేకాదు వర్మ మరో అడుగు ముందుకు వేసి అభిమానులు నిజంగా మెగాస్టార్ అభిమానులు అయితే తమ మెగాస్టార్‌ను 'బాహుబలి' - 'శాతకర్ణి'లాంటి సినిమాలు చేయమని అడగాలని అంటూ చిరంజీవిపై అన్యాపదేశంగా మరొక చురక అంటించాడు. ఇప్పుడు వర్మ చేసిన ట్విట్స్ మెగా అభిమానులకు తీవ్ర కోపాన్ని తెప్పించినట్లుగా వార్తలు వస్తున్నాయి.
 
మరోవైపు.. 'శాతకర్ణి' టీజర్‌కు నందమూరి అభిమానుల నుంచి మాత్రమే కాకుండా అన్ని వర్గాల నుండి ప్రశంసలు వస్తున్నాయి. ఈసినిమా కథపై సాధారణ ప్రేక్షకులకు ఎటువంటి క్లారిటీ లేకపోయినా బాలయ్య పవర్ ఫుల్ డైలాగ్స్‌కు నందమూరి అభిమానులు ఫిదా అవుతున్నారు. బాబా గణశేఖర్ అందించిన ఫోటోగ్రఫీ అదుర్స్ అనిపించే విధంగా ఉండగా, చైరంతాన్ భట్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ట్రైలర్‌ను బాగా ఎలివేట్ చేసింది అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. 
 
'బాహుబలి' మాదిరి స్టన్నింగ్ విజువల్స్‌ను ఒక సాధారణ బడ్జెట్‌లో చిత్రీకరించడం బహుశా క్రిష్ ఒక్కడికే సాధ్యo అంటూ క్రిష్‌పై అందరు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ ట్రైలర్ సూపర్ సక్సెస్ కావడంతో రాబోతున్న సంక్రాంతికి నందమూరి అభిమానులు మీసం మేలేయడం ఖాయం అని అంటున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రసన్న ఇంటిపై దాడి.. మూడు హత్యలు, ఆరు హత్యాయత్నాలు, 12 దాడులు: జగన్ ఫైర్

Hyderabad: రోజూ మద్యం తాగి వస్తే భరించేదెవరు? బండరాయితో కొట్టి చంపేసిన భార్య

EV Cycle: ఎలక్ట్రిక్ సైకిల్‌ను తయారు చేసిన ఇంటర్ విద్యార్థి సిద్ధు.. పవన్ ఏం చేశారంటే?

Bangalore: భార్యను నేలపై పడేసి, గొంతుపై కాలితో తొక్కి చంపేసిన భర్త

సీమాంధ్ర పాలకుల కంటే తెలంగాణకు కేసీఆర్ ద్రోహమే ఎక్కువ: రేవంత్ రెడ్డి (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments