Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెల్లపిల్ల తమన్నా చేతిలో రెండు కోట్ల రూపాయల వజ్రం.. ఎవరిచ్చారో తెలుసా?

Webdunia
గురువారం, 7 జులై 2022 (22:27 IST)
తెల్లపిల్ల తమన్నా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం సినీ, వెబ్ సిరీస్‌లతో బిజీగా గడుపుతున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఎఫ్ 3 సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది తమన్నా. ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. 
 
ఇక తమన్నా వ్యక్తిగత విషయానికి వస్తే ఈమె సినిమాలలో బాగానే ఆస్తులు సంపాదించినట్టు తెలుస్తుంది. ఖరీదైన కార్లు, బంగ్లాలను కొనుగోలు చేశారు. 
 
ఇకపోతే ప్రస్తుతం తమన్నా దగ్గర ఉన్నటువంటి ఒక వస్తువు గురించి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఐదవ వజ్రం తమన్నా దగ్గర ఉండటం గమనార్హం.
 
సుమారు రెండు కోట్లకు పైగా విలువ చేస్తే ఈ వజ్రాన్ని తమన్నాకు ప్రముఖ హీరో రామ్ చరణ్ సతీమణి కానుకగా ఇచ్చారట. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 
 
ఇక తమన్నా ఆస్తుల విషయానికి వస్తే ఈమెకు ముంబైలోని అత్యంత ఖరీదైన జుహూ ప్రాంతంలో రూ. 16.60 కోట్ల విలువచేసే అపార్ట్మెంట్‌తో పాటు కోట్లు విలువ చేసే కార్లు ఉన్నాయని తెలుస్తోంది.
 
ఇక ఈమె సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భోళా శంకర్ సినిమాలో నటిస్తున్నారు. ఇదివరకే తమన్నా మెగాస్టార్‌తో కలిసి సైరా నరసింహారెడ్డి సినిమాలో నటించిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

టీడీపీ జెండాను పట్టుకున్న నందమూరి హీరో కళ్యాణ్ రామ్.. మా మధ్య అవి లేవండి?

అన్నా ఒకసారి ముఖం చూస్కో.. ఎలా అయిపోయావో.. వంశీ అభిమానుల ఆందోళన (video)

అమరావతిలో చంద్రబాబు శాశ్వత ఇంటి నిర్మాణం ప్రారంభం.. ఎప్పుడు.. ఎక్కడ?

ఎస్బీఐ బ్యాంకు దొంగతనం- బావిలో 17 కిలోల బంగారం స్వాధీనం

మయన్మార్‌ భూకంపం.. 2,056కి పెరిగిన మృతుల సంఖ్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం
Show comments