Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐ.పి.ఎస్. అధికారిగా రామ్ చరణ్ గేమ్‌ ఛేంజర్‌ తాజా అప్ డేట్

డీవీ
గురువారం, 21 మార్చి 2024 (19:12 IST)
Ram Charan
తమిళ శంకర్‌ దర్శకత్వంలో రామ్‌చరణ్‌ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం 'గేమ్‌ ఛేంజర్‌'. ఏడాదిన్నర పైగా ఈ చిత్రం ప్రారంభమైంది. ఈ మార్చి 27 న చరన్ పుట్టినరోజు. ఈసారి కూడా ఆ సినిమా షూట్ లో వుండనున్నారు. ఇక లేటెస్ట్ అప్ డేట్ ఏమంటే, నేను అనగా గురువారంనాడు హైదరాబాద్ లోని ఎల్.బి.స్టేడియంలో మూడు రోజులపాటు భారీ షెడ్యూల్ చేస్తున్నారు.
 
సమకాలీన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఈ సినిమా కథ వున్న విషయం తెలిసిందే. ఇందులో రామ్ చరణ్ ఐ.పి.ఎస్. అధికారిగా నటిస్తున్నారని తెలుస్తోంది. దీనికి సంబంధించిన కీలకమైన సీన్ ను షూట్ చేస్తున్నారట. ఈ సినిమాలో ముఖ్యమంత్రిగా శ్రీకాంత్ నటిస్తున్నారు. ఎస్.జె.సూర్య మంత్రిగా నటిస్తున్నారు. రామ్ చరణ్ తో ఛాలెంజ్ సీన్ తీస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రితో జరిగే సవాల్, ప్రతిసవాల్ నేపథ్యంలో ఈ సన్నివేశం వుంటుందట. అందుకే ముఖ్యమంత్రిగా ప్రమాణంచేసే సందర్భంగా కావాలనే చరణ్ ను రపించి రెచ్చగొట్టే సీన్ ను చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.
 
ఇందులో రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. కియారా అద్వానీ, అంజలి నటిస్తున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు.
 
ఇదిలా వుండగా,  రామ్ చరణ్ పుట్టినరోజు మార్చి 27 న హైదరాబాద్ శిల్పకళావేదికలో గ్రాండ్ గా అభిమానుల సమక్షంలో జరపడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Ponguleti: వారికి రూ.5 లక్షలు ఇస్తాం... తెలంగాణ రెండ‌వ రాజ‌ధానిగా వరంగల్

భార్య కోసం మేనల్లుడిని నరబలి ఇచ్చిన భర్త.. సూదులతో గుచ్చి?

MK Stalin: ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కానున్న తమిళనాడు సీఎం స్టాలిన్

సెలవుల తర్వాత హాస్టల్‌కు వచ్చిన బాలికలు గర్భవతులయ్యారు.. ఎలా?

పాదపూజ చేసినా కనికరించని పతిదేవుడు... ఈ ఇంట్లో నా చావంటూ సంభవిస్తే...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments