Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రిన్స్ కోసం.. సాయిధరమ్ తేజ్, నితిన్‌కు హ్యాండిచ్చిన రకుల్ ప్రీత్ సింగ్.. ఎలా..?

మహేష్-మురుగదాస్ కాంబినేషన్‌లో అత్యంత భారీ బడ్జెట్‌తో సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్‌గా టాలీవుడ్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ ఎంపికైంది. రకుల్ సినిమా అంటేనే యువత పడిచస్తుంది. సిని

Webdunia
శనివారం, 13 ఆగస్టు 2016 (16:55 IST)
మహేష్-మురుగదాస్ కాంబినేషన్‌లో అత్యంత భారీ బడ్జెట్‌తో సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్‌గా టాలీవుడ్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ ఎంపికైంది. రకుల్ సినిమా అంటేనే యువత పడిచస్తుంది. సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ ఉంటే చాలు.  సినిమా చూసేదాకా వదలడం లేదు. గతంలో ఈ భామ మహేష్ బాబు హీరోగా నటించిన 'బ్రహ్మోత్సవం'లో హీరోయిన్ అవకాశాన్ని చేజార్చుకుంది. 
 
ఎట్టకేలకు ఆ అవకాశాన్ని మురుగదాస్ చిత్రం ద్వారా దక్కించుకుంది. దీనికోసం ఈ అమ్మడు సాయిధరమ్ తేజతో ఒప్పుకున్న సినిమాను కూడా రద్దుచేసుకుంది. విషయం తెలుసుకున్న సాయిధరమ్ తేజ్… రకుల్‌కు అభినందనలు చెప్పాడట. అయితే మహేష్ కోసం కేవలం సాయిధర్మతేజకే కాదు… మరో హీరోకు కూడా రకుల్ హ్యాండ్ ఇచ్చిందని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి ఆ హీరో మరెవరో కాదు లవర్ బాయ్ నితిన్. 
 
అ..ఆ సినిమా షూటింగ్ దశలో ఉన్నప్పుడే రకుల్‌ను కలిసిన నితిన్ ఆమెను తన నెక్ట్స్ సినిమాలో హీరోయిన్‌గా బుక్ చేసుకున్నాడు. కేవలం మాట తీసుకోవడం కాదు… అప్పట్లో ఆమెకు టోకెన్ అడ్వాన్స్ కూడా ఇచ్చాడట. కాని రకుల్ అతనికి హ్యాండ్ ఇచ్చి మహేష్‌కు కాల్షీట్లు సమర్పించుకుందట. దీంతో మరో హీరోయిన్‌ను వెదుక్కునే పనిలో నితిన్ ఉన్నాడని తెలుస్తోంది. మొత్తానికి మహేష్ సరసన నటించడం కోసం ఏకంగా సాయిధరమ్ తేజ, నితిన్‌కు రకుల్ ప్రీత్ సింగ్ హ్యాండ్ ఇచ్చినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రిన్స్ కోసం ఇద్దరు యంగ్ హీరోలకు హ్యాండ్ ఇచ్చిన రకుల్‌పై మహేష్ కరుణిస్తాడా లేదో వేచి చూడాల్సిందే.
అన్నీ చూడండి

తాజా వార్తలు

అమెరికాలో నారా లోకేష్.. తెలంగాణ నెటిజన్ల బాధేంటంటే?

ఏపీలో రూ.1,40,000 కోట్లు పెట్టుబడి.. అనకాపల్లిలో స్టీల్ ప్లాంట్

సొంత రాష్ట్రం.. ఆర్మీ జవాన్లతో ప్రధాని మోదీ దీపావళి సెలెబ్రేషన్స్ (video)

కేరళలో వందే భారత్ సరికొత్త ట్రాక్‌ల కోసం ఏర్పాట్లు

ఆ మీడియా సంస్థలను నడిరోడ్డు మీద నిలబెడతా: పోలీసు వాహనం నుంచి బోరుగడ్డ వార్నింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

15 నిమిషాల నడక వల్ల 7 ప్రయోజనాలు, ఏంటవి?

గుమ్మడి విత్తనాలు ఎందుకు తినాలో తెలుసుకోవాల్సిన విషయాలు

కమలా పండ్లు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

తీపిపదార్థాలను తినడాన్ని వదులుకోవాల్సిన అవసరం లేదు, ఎలాగంటే?

ఎముక పుష్టి కోసం ఇవి తినాలి, ఇలా చేయాలి

తర్వాతి కథనం
Show comments