Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్ కల్యాణ్ బర్త్ డే స్పెషల్: సెప్టెంబర్ 2న ధృవ టీజర్‌

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హీరోగా నటిస్తోన్న చిత్రం 'ధృవ'. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో చెర్రీ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటిస్తోంది. రకుల్ ప్రీత్ సింగ్ చరణ

Webdunia
శనివారం, 13 ఆగస్టు 2016 (16:12 IST)
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హీరోగా నటిస్తోన్న చిత్రం 'ధృవ'. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో చెర్రీ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటిస్తోంది. రకుల్ ప్రీత్ సింగ్ చరణ్ సరసన రోండోసారి హీరోయిన్‌గా నటిస్తుండడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్‌ బ్యానర్‌పై అల్లు అరవింద్‌ నిర్మిస్తున్నారు. 
 
గతేడాది తమిళంలో విడుదలై ఘన విజయం సాధించిన 'తని ఒరువన్‌'కి రీమేక్‌గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. దీంట్లో రామ్‌ చరణ్‌ కొత్తలుక్‌లో కనిపించబోతున్నారు. సురేందర్‌ రెడ్డి కాంబినేషన్‌లో తెరకెక్కుతుండడంతో ఈ చిత్రంపై ఇప్పటికే ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా సినిమాను భారీగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో మరో ఆకర్షణగా అరవింద్‌ స్వామి క్యారెక్టరైజేషన్‌ నిలుస్తుంది. 
 
ఇటీవలే రిలీజ్ చేసిన ఈ మూవీ ప్రీ లుక్ పోస్టర్‌కు ప్రేక్షకుల నుండి అనూహ్య స్పందన లభించింది. ఈ చిత్రాన్ని దసరా కానుకగా విడుదల చేయాలని దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. అంతేకాదు ధృవ టీజర్‌ను సెప్టెంబర్ 2న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే స్పెషల్‌గా విడుదల చేయాలనుకుంటున్నారు. అయితే ఈ టీజర్ లాంచ్ కోసం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ను ముఖ్య అతిధిగా రప్పించాలని యూనిట్ సభ్యులు భావిస్తున్నారు. మరి చెర్రీ కోసం బాబాయ్ వస్తాడో లేదో తెలియాలంటే...సెప్టెంబర్ 2 దాకా ఆగాల్సిందే.
అన్నీ చూడండి

తాజా వార్తలు

అమెరికాలో నారా లోకేష్.. తెలంగాణ నెటిజన్ల బాధేంటంటే?

ఏపీలో రూ.1,40,000 కోట్లు పెట్టుబడి.. అనకాపల్లిలో స్టీల్ ప్లాంట్

సొంత రాష్ట్రం.. ఆర్మీ జవాన్లతో ప్రధాని మోదీ దీపావళి సెలెబ్రేషన్స్ (video)

కేరళలో వందే భారత్ సరికొత్త ట్రాక్‌ల కోసం ఏర్పాట్లు

ఆ మీడియా సంస్థలను నడిరోడ్డు మీద నిలబెడతా: పోలీసు వాహనం నుంచి బోరుగడ్డ వార్నింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

15 నిమిషాల నడక వల్ల 7 ప్రయోజనాలు, ఏంటవి?

గుమ్మడి విత్తనాలు ఎందుకు తినాలో తెలుసుకోవాల్సిన విషయాలు

కమలా పండ్లు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

తీపిపదార్థాలను తినడాన్ని వదులుకోవాల్సిన అవసరం లేదు, ఎలాగంటే?

ఎముక పుష్టి కోసం ఇవి తినాలి, ఇలా చేయాలి

తర్వాతి కథనం
Show comments