Webdunia - Bharat's app for daily news and videos

Install App

మితిమీరిన గ్లామర్ షో చేయను.. వాళ్లు నమ్మి ఈ ఫీల్డ్‌కి పంపించారు: రకుల్ ప్రీత్ సింగ్

రెండుసార్లు మిస్‌ ఇండియా ఫైనల్స్‌కి వెళ్ళడమే కాకుండా నాలుగు సబ్‌ టైటిల్స్‌ గెల్చుకుని మోడలింగ్‌ ఫీల్డ్‌కి వెళ్ళి ఆ తర్వాత కన్నడలో 'గిల్లి' చిత్రం ద్వారా హీరోయిన్‌గా పరిచయమైంది అందాల హీరోయిన్‌ రకుల్‌ ప

Webdunia
గురువారం, 22 సెప్టెంబరు 2016 (10:42 IST)
రెండుసార్లు మిస్‌ ఇండియా ఫైనల్స్‌కి వెళ్ళడమే కాకుండా నాలుగు సబ్‌ టైటిల్స్‌ గెల్చుకుని మోడలింగ్‌ ఫీల్డ్‌కి వెళ్ళి ఆ తర్వాత కన్నడలో 'గిల్లి' చిత్రం ద్వారా హీరోయిన్‌గా పరిచయమైంది అందాల హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌. ప్రస్తుతం అరడజను ప్రాజెక్టుల్లో నటిస్తూ క్షణం తీరిక లేకుండా గడుపుతోంది. ఆకట్టుకునే అందం, చలాకీ మాటతీరు, తనదైన గడుసుదనంతో వరుస అవకాశాలు దక్కించుకుంటూ టాలీవుడ్లో స్టార్ హీరోయిన్‌గా దూసుకెలుతోంది. ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తున్న చిత్రం రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న 'ధృవ'. 
 
ప్రస్తుతం ఈ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. దీంతో పాటు మహేష్ బాబు-ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కే మూవీలో, బోయపాటి శ్రీను దర్శకత్వంలో రాబోతుతున్న మూవీలో బెల్లంకొండ శ్రీను సరసన, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కే చిత్రంలో, విశాల్ హీరోగా తెరకెక్కే తమిళ చిత్రంలో అవకాశం దక్కించుకుంది. 
 
ఇదిలావుంటే.. తాజాగా రకుల్ తన సినీ కెరీర్ గురించి కొన్నిఆసక్తికర విషయాలను వెల్లడించింది. తనకు గ్లామర్ షో చెయ్యడానికి ఇబ్బంది లేదని చెప్తూనే.. అవి మితిమీరినవిగా ఉండకూడదని, తన ఫ్యామిలీతో కలిసి చూసే విధంగా ఉండేలాగా చూసుకుంటా అని చెప్పింది రకుల్.  ఎందుకంటే.. నామీద నమ్మకంతోనే ఇంట్లో వాళ్ళు నన్ను ఈ ఫీల్డ్‌కి పంపించారని, దానికి కట్టుబడి ఉండటమే కాకుండా, నా సినిమాలు చూసే వాళ్ళు కూడా ఇబ్బంది పడకూడదు కదా అంటూ తెలిపింది.

చోటు లేదని కారు టాప్ పైన ఎక్కి కూర్చున్న యువతి, రద్దీలో రయ్యమంటూ ప్రయాణం

కదులుతున్న బస్సులో మంటలు- తొమ్మిది మంది సజీవదహనం

ఖమ్మం: తల్లి, ఇద్దరు పిల్లలను హత్య చేసిన వ్యక్తి.. భార్య కూడా?

సాధారణ మహిళలా మెట్రోలో నిర్మలా సీతారామన్ జర్నీ.. వీడియో వైరల్

కేరళలో విజృంభిస్తున్న హెపటైటిస్ ఏ- 12 మంది మృతి.. లక్షణాలు

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments