Webdunia - Bharat's app for daily news and videos

Install App

అవును... 'చై'తో డైటింగ్‌లో ఉన్నాను.. సమంత

టాలీవుడ్ టాప్ స్టార్స్ నాగచైతన్య, సమంతల విషయం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. వారి ప్రేమ విషయం ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరికి తెలిసిపోయింది. ఫైన‌ల్‌గా చైతు-స‌మంత పెళ్లికి ఇరు వైపు పెద్ద‌ల నుంచ

Webdunia
గురువారం, 22 సెప్టెంబరు 2016 (09:35 IST)
టాలీవుడ్ టాప్ స్టార్స్ నాగచైతన్య, సమంతల విషయం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. వారి ప్రేమ విషయం ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరికి తెలిసిపోయింది. ఫైన‌ల్‌గా చైతు-స‌మంత పెళ్లికి ఇరు వైపు పెద్ద‌ల నుంచి గ్రీన్‌సిగ్న‌ల్ రావ‌డంతో వీరి ప్రేమ స్టోరీకి శుభం కార్డు ప‌డింది. అయితే ఈ విషయంపై ఇప్పటివరకు నోరు తెరవని సమంత తొలిసారిగా నోరు విప్పింది. 'అవును, ప్రేమలో ఉన్నాను' అని సమంత ప్రకటించిన నాటి నుంచి టాలీవుడ్, కోలీవుడ్‌లో ఎన్నోవార్తలు వెలువడ్డాయి. వీటిని ఎన్నడూ ఖండించని సమంత నవ్వుతూనే దాటవేసింది. 
 
అయితే, నాగార్జున, చైతూ కూడా ఈ విషయం చెప్పేయడంతో తను కూడా ఇక దాచడం ఎందుకనుకుందేమో, ప్రియుడి పేరు తన నోటితో కూడా చెప్పింది. "అవును 'చై'తో డేటింగ్‌లో ఉన్నాను" అంటూ ప్రకటించింది. అయితే పెళ్లి ఎప్పుడు చేసుకుంటున్నామన్న విషయం ఇంకా నిర్ణయించుకోలేదని, కుటుంబాలకు కూడా తమ వివాహ తేదీ మూడు నెలల ముందే చెబుతామని సమంత వెల్లడించింది. 
 
'ఏం మాయ చేశావే' సినిమా నాటి నుంచి తామిద్దరం మంచి స్నేహితులమని సమంత... ఆ పరిచయం కాస్త ప్రేమగా మారిందని... వివాహానంతరం కూడా సినిమాల్లో నటిస్తానని తెలిపింది. తమ కుటుంబం, ప్రేక్షకుల ఆదరణపై వివాహానంతరం సినిమాల్లో నటించే విషయమై నిర్ణయం తీసుకుంటానని చెప్పింది. కుటుంబం తన నిర్ణయాన్ని గౌరవిస్తుందని, ఎందుకంటే సినిమాల గురించి తన కుటుంబానికి తెలుసని చెప్పింది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇజ్రాయెల్‌ నిబద్ధతపై అనుమానాలు : ఇరాన్

ఏపీలో మూడు రోజుల విస్తారంగా వర్షాలు

సింగయ్య మృతి కేసు : ఆ కారు జగన్మోహన్ రెడ్డిదే..

బంగ్లాదేశ్‌లో హిందూ మహిళపై అత్యాచారం

మాజీ సీఎం జగన్‌కు షాకివ్వనున్న జొన్నలగడ్డ పద్మావతి దంపతులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments