Webdunia - Bharat's app for daily news and videos

Install App

మళ్ళీ ఐటం సాంగ్‌లో రాయ్‌ లక్ష్మీ

లక్ష్మీరాయ్‌గా కథానాయికగా పలు చిత్రాలు చేసి ఆ తర్వాత రాయ్‌ లక్ష్మీగా పేరు మార్చుకుని ఐటంసాంగ్‌లోనూ నటించింది. తాజాగా మరో సినిమాలో నటించడానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. సూపర్‌గుడ్‌ ఫిలింస్‌ బ్యానర్‌పై సాయి రమణి దర్శత్వంలో రాఘవ లారెన్స్‌

Webdunia
గురువారం, 5 మే 2016 (20:39 IST)
లక్ష్మీరాయ్‌గా కథానాయికగా పలు చిత్రాలు చేసి ఆ తర్వాత రాయ్‌ లక్ష్మీగా పేరు మార్చుకుని ఐటంసాంగ్‌లోనూ నటించింది. తాజాగా మరో సినిమాలో నటించడానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. సూపర్‌గుడ్‌ ఫిలింస్‌ బ్యానర్‌పై సాయి రమణి దర్శత్వంలో రాఘవ లారెన్స్‌ హీరోగా 'మొట్ట శివ కెట్ట శివ' వస్తున్న విషయం తెలిసిందే. కళ్యాణ్‌ రామ్‌ 'పటాస్‌' రీమేక్‌గా తమిళ్‌లో రూపొందుతోంది. లారెన్స్‌ పవర్‌ఫుల్‌ పోలీసు ఆఫీసర్‌ పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో లారెన్స్‌కు జోడీగా నిక్కీ గల్రానీ నటించింది. ఈ సినిమాలో రాయ్‌ లక్ష్మి ఐటమ్‌ సాంగ్‌‌లో నర్తించనుంది.
 
మరో రెండు రోజుల్లో ఈ పాటను లారెన్స్‌, రాయ్‌ లక్ష్మిలపై చిత్రీకరిస్తారని తెలిసింది. దాదాపు షూటింగ్‌ మొత్తం పూర్తిచేసుకున్న ఈ సినిమాలో సీనియర్‌ సత్యరాజ్‌ కీలక పాత్రలో, కోవై సరళ, దేవదర్శిని, షామ్స్‌ సహాయక పాత్రల్లో నటిస్తున్నారు. యాక్షన్‌ కథాంశంతో రూపొందుతున్న ఈ సినిమాలో కామెడీతో యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల్ని అలరిస్తుందని సమాచారం. 
 
ఖాకీ డ్రెస్‌ ధరించి గుండుతో ఉన్న లారెన్స్‌ విడుదల చెసిన ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌కు మంచి స్పందన లభించిన విషయం తెలిసిందే. సర్వేష్‌ మూరారి ఈ సినిమాకు సినిమాటోగ్రఫీ అందిస్తుండగా సీనియర్‌ నటి జయచిత్ర కుమారుడు అయిన అమ్రేష్‌ గణేష్‌ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Jio: ఆంధ్రప్రదేశ్ టెలికాం సర్కిల్‌లో జియో నెట్‌వర్క్‌ ఏర్పాటు

Drum Tower: 650 ఏళ్ల డ్రమ్ టవర్ కూలిపోయింది.. వీడియో

పాకిస్తాన్ పోలీసులను పరుగెత్తించి కర్రలతో బాదుతున్న సింధ్ ప్రజలు, ఎందుకని?

Ganga river: గంగానదిలో కొట్టుకుపోతున్న వ్యక్తిని చున్నీతో కాపాడిన మహిళ (video)

Policemen: డ్యూటీ సమయంలో హాయిగా కునుకుతీసిన పోలీసులు.. అలా పట్టుబడ్డారు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments