Webdunia - Bharat's app for daily news and videos

Install App

సినిమాల్లోకి మాజీ సిఎం భార్య.. ఆమెను చూస్తే...!

కన్నడ నటి రాధికా కుమారస్వామి సినీ రంగంలోకి రీ ఎంట్రీ ఇచ్చారు. కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న రాధికా కుమార స్వామి.. కన్నడ నటుడు రవిచంద్రన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న రాజేంద్ర పొన్నప్ప అనే చిత్రంలో కథానాయికగా ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

Webdunia
సోమవారం, 10 జులై 2017 (15:06 IST)
కన్నడ నటి రాధికా కుమారస్వామి సినీ రంగంలోకి రీ ఎంట్రీ ఇచ్చారు. కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న రాధికా కుమార స్వామి.. కన్నడ నటుడు రవిచంద్రన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న రాజేంద్ర పొన్నప్ప అనే చిత్రంలో కథానాయికగా ప్రేక్షకుల ముందుకు రానున్నారు.
 
దాదాపు పదకొండేళ్ల తరువాత రవిచంద్రన్, రాధికా కుమారస్వామిలు జంటగా మళ్లీ తెరపైన కనిపించబోతున్నారు. రవిచంద్రన్‌ స్వతహాగా రాసిన కథతో ఈ చిత్రాన్ని నిర్మిస్తూ తానే దర్శకత్వం వహిస్తున్నారు. ఈశ్వరి ప్రొడక్షన్‌ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ త్వరలోనే ప్రారంభిచనున్నట్లు రవిచంద్రన్‌ తెలిపారు. ఛాయగ్రహకుడుగా జి.ఎస్‌.వి. సీతారామ్,  సంగీత దర్శకుడుగా గౌతమ్‌ శ్రీవత్సవ్‌ సహకారం అందజేయనున్నారు.  
 
కర్నాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామిని రాధిక పెళ్లాడిన సంగతి తెలిసిందే. అప్పటికే పెళ్లయిన కుమార స్వామిని ఆమె రెండో వివాహం చేసుకున్నారు. కుమారస్వామి గతంలో సినిమా రంగంలో నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్‌గా పని చేసిన   సమయంలో రాధికతో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. తర్వాత ఇద్దరూ వివాహం చేసుకున్నారు. వీరికి ఓ కూతురు కూడా ఉంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

మయన్మార్‌లో భారీ భూకంపం.. పెరుగుతున్న మృతుల సంఖ్య

ఎన్‌కౌంటర్‌ నుంచి తప్పించుకున్నా... ఇది పునర్జన్మ : మంత్రి సీతక్క (Video)

గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసు : వల్లభనేని వంశీకి మళ్లీ నిరాశ

ఉద్యోగం కోసం కీచులాటల్లో భార్యను హత్య చేసాడా? భార్యాభర్తల కాల్ డేటా చూస్తున్నారా?

త్రిభాషా విద్యా విధానం వద్దు.. ద్విభాషే ముద్దు... వక్ఫ్ బిల్లు రద్దు చేయాలి : విజయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments