Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీవీ లైవ్‌లో బోరున విలపించిన శ్రీదేవి... వీడియో

'అతిలోక సుందరి' శ్రీదేవి టీవీ లైవ్‌షోలో బోరున విలపించింది. ఈనెల ఏడో తేదీనతో వెండితెర అరంగేట్రం చేసి అర శతాబ్దాన్ని పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఆమె నటించిన తాజా చిత్రం "మామ్" అదే రోజున విడుదల చేశారు.

Webdunia
సోమవారం, 10 జులై 2017 (14:44 IST)
'అతిలోక సుందరి' శ్రీదేవి టీవీ లైవ్‌షోలో బోరున విలపించింది. ఈనెల ఏడో తేదీనతో వెండితెర అరంగేట్రం చేసి అర శతాబ్దాన్ని పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఆమె నటించిన తాజా చిత్రం "మామ్" అదే రోజున విడుదల చేశారు. బాక్సాఫీస్ వద్ద ఆ సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఆసాంతం భావోద్వేగాలతో సాగే ఆ సినిమాలో శ్రీదేవి అసాధారణ నటనను కనబరిచారంటూ ప్రేక్షకులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అదేసమయంలో చిత్రం హిట్ కావడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా శ్రీదేవి తీవ్రమైన భావోద్వేగానికి గురయ్యారు. లైవ్‌లోనే బోరున విలపించారు.
 
ఈ సందర్భంగా శ్రీదేవి మాట్లాడుతూ... 'సాజల్.. నా తల్లి ఐ లవ్యూ. నేను ఎందుకు ఇంతలా ఉద్వేగానికి గురవుతున్నానో అర్థం కావట్లేదు. సాజల్, అద్నాన్ లేకుండా ఇంత మంచి సినిమా సాధ్యమయ్యేదే కాదు. ఇంత మంచి విజయం సాధించి ప్రమోషన్లు నిర్వహిస్తున్న సందర్భంలో మీరు లేకపోవడం చాలా బాధిస్తోంది. మిమ్మల్ని మిస్సవుతున్నాను. సాజల్ నువ్వు ఈ సినిమాలో నటించిన తీరు నిజంగా అద్భుతం. నువ్వులేని ఈ సినిమా నిజంగా అసంపూర్ణం. ఈ క్షణం చాలా ప్రత్యేకమైనది. దీనికోసమే అంతా చూస్తున్నాం' అంటూ శ్రీదేవి కన్నీటి పర్యంతమయ్యారు. ఆ వీడియోను ఓ అభిమాని యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేశారు.
 
సాజల్‌తో శ్రీదేవి అంతలా కనెక్ట్ కావడానికి ఓ కారణం ఉంది. మామ్ చిత్రంలో సాజల్.. శ్రీదేవి కుమార్తెగా నటించింది. షూటింగ్‌లో అత్యంత చేరువైన సాజల్ అలీతో.. శ్రీదేవి అమ్మకన్నా ఎక్కువైన బంధాన్నే ఏర్పరచుకుందట. కానీ, ఈ చిత్రం ప్రమోషన్లలో యూనిట్ అంతా పాల్గొంటున్నా.. సినిమాలో భాగమైన సాజల్ అలీ, పాకిస్థాన్‌కు చెందిన మరో నటుడు అద్నాన్ సిద్ధిఖీ హాజరు కాలేకపోయారు. అదే శ్రీదేవిని బాధపెట్టిందట. ఈ విషయాన్నే శ్రీదేవి వెల్లడిస్తూ బోరున విలపించింది. 

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

ఏంటి.. టీడీపీ ఏజెంటుగా కూర్చొంటావా.. చంపేసి శవాన్ని పోలింగ్ కేంద్రానికి పంపితే దిక్కెవరు?

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

నల్లద్రాక్షను తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments