Webdunia - Bharat's app for daily news and videos

Install App

'మాస్ మహరాజ్‌'తో ఆడిపాడనున్న రాశీఖన్నా

టాలీవుడ్ అందాల భామల్లో ఒకరైన రాశీఖన్నా కూడా స్పెషల్ సాంగ్‌లో చిందేయడానికి సిద్ధమైంది. 'మాస్ మహరాజ్' రవితేజ హీరోగా నటిస్తున్న చిత్రం "రాజా ది గ్రేట్''లో రాశీ ఓ స్పెషల్ సాంగ్‌లో ఆడిపాడబోతుంది.

Webdunia
శుక్రవారం, 15 సెప్టెంబరు 2017 (17:00 IST)
టాలీవుడ్ అందాల భామల్లో ఒకరైన రాశీఖన్నా కూడా స్పెషల్ సాంగ్‌లో చిందేయడానికి సిద్ధమైంది. 'మాస్ మహరాజ్' రవితేజ హీరోగా నటిస్తున్న చిత్రం "రాజా ది గ్రేట్''లో రాశీ ఓ స్పెషల్ సాంగ్‌లో ఆడిపాడబోతుంది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా తన సోషల్ మీడియా ఖాతా ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. స్పెషల్ సాంగ్‌తో పాటు అతిథి పాత్రలోనూ కన్పించే అవకాశాలున్నాయని ట్వీట్ చేసింది.
 
కాగా, ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే రిలీజైన ఫస్ట్‌లుక్, టీజర్ ఫ్యాన్స్‌ను అలరిస్తుండగా ఇప్పుడు రాశీ స్పషల్ సాంగ్‌తో సినిమాపై అంచనాలు మరింతగా పెంచేశాయి. అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న 'రాజా ది గ్రేట్'లో రవితేజ అంధుడి పాత్రలో కన్పించనున్న విషయం తెల్సిందే. 
 
ఇందులో రవితేజ కుమారుడు మహాధన్‌ ఎంట్రీ ఇస్తుండగా, రవితేజ తల్లిగా ప్రముఖ నటి రాధిక నటిస్తోంది. దిల్‌రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ మూవీలో మెహరీన్‌ హీరోయిన్. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాని అక్టోబర్‌లో విడుదల చేయాలన్న ప్లాన్‌లో నిర్మాత ఉన్నట్టు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అద్దెకు ఉంటున్న యువతి బాత్రూమ్‌లో సీక్రెట్ కెమెరా... లైవ్‌లో చూస్తూ పైశాచికం...

హనీమూన్ ట్రిప్ పేరుతో ఘరానా మోసం... కొత్త జంటకు కుచ్చుటోపీ...

ఒక్క ఛాన్స్ వస్తే హోం మంత్రిని అవుతా.. ఆపై రెడ్ బుక్ ఉండదు.. బ్లడ్ బుక్కే : ఆర్ఆర్ఆర్

హిమాచల్ ప్రదేశ్ ఆగని వర్షాలు... వరదలకు 75 మంది మృతి

రూ.7.5 కోట్ల ఫెరారీ కారుకు రూ.1.42 కోట్ల పన్ను.. క్షణాల్లో చెల్లించిన కోటీశ్వరుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments