Webdunia - Bharat's app for daily news and videos

Install App

నగ్మా - శరత్ కుమార్ రొమాన్స్... రాయ్ లక్ష్మీ "జూలీ 2" కథ?

టాలీవుడ్ హాటెస్ట్ హీరోయిన్ రాయ్ లక్ష్మీ ప్రధాన పాత్రధారిగా తెరకెక్కించిన చిత్రం "జూలీ 2". ఈ చిత్రం శుక్రవారం హిందీ, తమిళ భాషల్లో విడుదలకానుంది. ఈ చిత్రం కథ ఓ స్టార్ హీరోయిన్ రియల్ లైఫ్ స్టోరీ‌గా తెలుస

Webdunia
గురువారం, 23 నవంబరు 2017 (14:02 IST)
టాలీవుడ్ హాటెస్ట్ హీరోయిన్ రాయ్ లక్ష్మీ ప్రధాన పాత్రధారిగా తెరకెక్కించిన చిత్రం "జూలీ 2". ఈ చిత్రం శుక్రవారం హిందీ, తమిళ భాషల్లో విడుదలకానుంది. ఈ చిత్రం కథ ఓ స్టార్ హీరోయిన్ రియల్ లైఫ్ స్టోరీ‌గా తెలుస్తోంది.
 
ఇదే అంశంపై చిత్ర సమర్పకుడు పహ్లాజ్ నిహ్లాని స్పందిస్తూ, '1990ల చివరలోని ఓ పాపులర్‌ హీరోయిన్‌ జీవితకథ ఆధారంగా మా చిత్రం రూపుదిద్దుకొంది. అయితే ఆమె పేరుని మాత్రం నేను చెప్పలేను. మరో ముఖ్యమైన విషయమేమిటంటే మా సినిమాలో కీలక పాత్ర పోషించిన నటుడితో కూడా ఆ హీరోయిన్‌కు అనుబంధముంది. ఆమె పేరు వెల్లడించడం వల్ల మా సినిమా ఆగిపోయే ప్రమాదం ఉంది కనుక ఆ పని మాత్రం చేయలేను. శుక్రవారం సినిమా చూసే ప్రతి ఒక్కరికీ రాయ్‌ లక్ష్మి పోషించిన రియల్‌ లైఫ్‌ హీరోయిన్‌ పాత్ర ఎవరిదో అర్థమై పోతుంది' అని ఆమె వ్యాఖ్యానించారు. 
 
అయితే, ఆ హీరోయిన్ పేరు వెల్లడించడానికి నిరాకరించారు. కానీ, ఆ హీరోయిన్ గురించి క్లూస్ ఇచ్చారు. 'ఆమె హిందీ సినిమాలతో కెరీర్‌ ప్రారంభించింది. ఆ తర్వాత తెలుగు చిత్రరంగానికి వెళ్లింది. టాప్‌ హీరోయిన్‌గా అక్కడ ఓ వెలుగు వెలిగింది. ఆ తర్వాత అవకాశాలు తగ్గడంతో తమిళ చిత్రరంగానికి వెళ్లింది. అప్పటికే పెళ్లయిన ఓ తమిళ హీరోతో ఎఫైర్‌ పెట్టుకోవడం వల్ల అది వివాదాస్పదమైంది. దాంతో ఆ తర్వాత ఆమె భోజ్‌పురి సినిమాల్లో నటించి, చివరకు వెండితెరకు దూరమైంది' అని వివరించారు. పహ్లాజ్ నిహ్లాని ఇచ్చిన క్లూస్ ప్రకారం ఆ హీరోయిన్ నగ్మా అని ఎవరికైనా ఇట్టే అర్థమైపోతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అంబులెన్స్‌కు దారివ్వని కారు డ్రైవర్.. రూ.2.5 లక్షల అపరాధం.. లైసెన్స్ రద్దు.. (Video)

'విశ్వ సుందరి'గా డెన్మార్క్ అందాల భామ

ఆవు పేడ కుప్పలో రూ.20 లక్షల నోట్లు

గుంటూరు మేయరుపై కేసు నమోదు... అరండల్ పేట పోలీసులకు ఫిర్యాదు

లేడీ టీచర్ కుర్చీ కింద బాంబు అమర్చి రిమోట్‌తో పేల్చిన విద్యార్థులు.. ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యాల్షియం స్థాయిలను వృద్ధి చేసే 6 సహజసిద్ధ పానీయాలు, ఏంటవి?

బెల్లంతో చేసిన నువ్వుండలు తింటే ప్రయోజనాలు

యూరిక్ యాసిడ్ తగ్గించే పండ్లు ఏంటి?

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడం కొన్ని బాదంపప్పులు తినండి

దుమ్ము లేదా డస్ట్ అలర్జీ ఉందా? ఐతే ఇలా చేయండి

తర్వాతి కథనం
Show comments