Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రత్తాలుకు ఫ్లయింగ్ కిస్ ఇచ్చిన చిరు... జూలీకి ఆల్ ది బెస్ట్ (వీడియో)

కత్తి రీమేక్ ఖైదీ 150లో రత్తాలు రత్తాలు పాటకు మెగాస్టార్ చిరంజీవి సరసన చిందేసిన రాయ్ లక్ష్మీ ప్రస్తుతం బాలీవుడ్ అరంగేట్రం చేసింది. బాలీవుడ్‌లో రాయ్ లక్ష్మీ నటించిన జూలీ 2 శుక్రవారం విడుదల కానుంది. ఈ న

రత్తాలుకు ఫ్లయింగ్ కిస్ ఇచ్చిన చిరు... జూలీకి ఆల్ ది బెస్ట్ (వీడియో)
, గురువారం, 23 నవంబరు 2017 (11:09 IST)
కత్తి రీమేక్ ఖైదీ 150లో రత్తాలు రత్తాలు పాటకు మెగాస్టార్ చిరంజీవి సరసన చిందేసిన రాయ్ లక్ష్మీ ప్రస్తుతం బాలీవుడ్ అరంగేట్రం చేసింది. బాలీవుడ్‌లో రాయ్ లక్ష్మీ నటించిన జూలీ 2 శుక్రవారం విడుదల కానుంది.

ఈ నేపథ్యంలో హీరోయిన్ రాయ్ లక్ష్మికి మెగాస్టార్ చిరంజీవి ఊహించని సర్ ప్రైజ్ ఇచ్చారు. జూలీ2 రిలీజ్‌ను పురస్కరించుకుని రాయ్ లక్ష్మీకి ఆల్ ది బెస్ట్ చెబుతూ ఓ వీడియోను పంపారు చిరంజీవి. 
 
బాలీవుడ్‌లో తొలి సినిమా చేస్తున్న రాయ్ లక్ష్మీకి విడుదల సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. రాయ్ లక్ష్మీకి ఇది ప్రత్యేకమైన చిత్రమని.. ఎందుకంటే.. అది రాయ్ లక్ష్మీ కెరీర్‌లో 50వ సినిమా అంటూ చెప్పుకొచ్చారు. వివిధ భాషల్లో నటిస్తూ ప్రేక్షకులకు దగ్గరవుతున్న రాయ్ లక్ష్మీని చూసి ఎంతో సంతోషిస్తున్నానని మెగాస్టార్ కొనియాడారు.

అంతేగాకుండా రాయ్ లక్ష్మీ తన టాలెంట్‌, సత్తాను జూలీ-2లో చూపిస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. రాయ్ లక్ష్మీ జీవితంలో మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని కోరుకుంటున్నానని తెలిపారు. "వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్... గుడ్ లక్ టు 'జూలీ 2'" అంటూ చివర్లో ఫ్లయింగ్ కిస్ విసిరారు.
 
ఈ వీడియోను చూసి రాయ్ లక్ష్మి సంతోషంలో ఎగిరి గంతేసింది. ఓ మై గాడ్ మీ నుంచి శుభాకాంక్షలు అందుకోవడం నిజంగా ఆశీర్వచనం లాంటిదని చెప్పుకొచ్చింది. నా జీవితంలో ఇది ఒక గొప్ప బహుమతి. థ్యాంక్యూ సో మచ్ చిరంజీవి గారు. ఊహించని అనుభూతికి నేను లోనయ్యాను. లవ్ యూ సర్" అంటూ ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

యుద్ధంలో గెలిచామా లేదా అన్నదే పాయింట్... 'జవాన్' ట్రైలర్