అవి నంది కావు.. సైకిల్ అవార్డ్స్.. బండ్ల గణేష్.. ఆపై సారీ
నంది అవార్డ్స్‌పై నటుడు, నిర్మాత బండ్ల గణేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నంది అవార్డ్స్ తీరు సరిగ్గా లేదంటూ విమర్శలు గుప్పించారు. ఆ అవార్డ్స్‌కు నంది అని పేరు పెట్టేకంటే.. సైకిల్ అవార్డ్స్ అని పేరు పెడితే
నంది అవార్డ్స్‌పై నటుడు, నిర్మాత బండ్ల గణేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నంది అవార్డ్స్ తీరు సరిగ్గా లేదంటూ విమర్శలు గుప్పించారు. ఆ అవార్డ్స్‌కు నంది అని పేరు పెట్టేకంటే.. సైకిల్ అవార్డ్స్ అని పేరు పెడితే బాగుంటుందని చెప్పారు. అయితే బండ్ల గణేష్ కామెంట్లపై తీవ్ర విమర్శలు రావడంతో తన వ్యాఖ్యలను గణేష్ ఉపసంహరించుకున్నారు.
వివరాల్లోకి వెళితే.. ఇవి నంది అవార్డ్స్ కాదు.. సైకిల్ అవార్డ్స్. ఆ అవార్డ్స్‌కు సైకిల్ అవార్డ్స్ అని పేరు పెడితే బాగుంటుంది. నాడు ''మగధీర'' సినిమాలో అద్భుతంగా నటించిన రామ్ చరణ్ కు అవార్డు ఇవ్వకుండా అన్యాయం చేశారు. అప్పుడు కూడా ‘మెగా’ ఫ్యామిలీకి అన్యాయం చేశారు. అప్పుడు అధికారంలో ఉంది హస్తం కావచ్చు. ప్రస్తుతం సైకిల్ ఆపని చేసింది.
ప్రభుత్వ అవార్డులపై ఇలాంటి కామెంట్లు చేయడం సబబు కాదంటున్నారు కాబట్టి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నా.. క్షమాపణలు కోరుతున్నా.. కానీ మెగా ఫ్యామిలీకి మాత్రం అన్యాయం జరిగిందని బండ్ల గణేష్ తన అభిప్రాయం వ్యక్తం చేశారు. రఘుపతి వెంకయ్య అవార్డును మెగాస్టార్ చిరంజీవికి ఇవ్వడం కంటితుడుపు చర్యేనని బండ్ల గణేష్ అన్నారు.