Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిరుత కాంబినేషన్లో మూవీ నిజమేనా..?

Webdunia
బుధవారం, 18 నవంబరు 2020 (18:34 IST)
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ ఆర్ఆర్ఆర్, ఆచార్య సినిమాల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఆర్ఆర్ఆర్ మూవీలో యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో కలిసి నటిస్తుంటే... ఆచార్యలో నాన్న మెగాస్టార్ చిరంజీవితో కలిసి నటిస్తున్నారు. అయితే... ఈ రెండు సినిమాల తర్వాత ఏ సినిమా చేయనున్నాడు అనేది ఇంకా ఖరారు కాలేదు. ఆర్ఆర్ఆర్లో నటిస్తున్న ఎన్టీఆర్ తదుపరి చిత్రాన్ని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో చేయనున్నారు.
 
ఈ చిత్రాన్ని అఫిషియల్‌గా ఎనౌన్స్ చేయడం కూడా జరిగింది. అయితే.. చరణ్ మాత్రం నెక్ట్స్ మూవీ ఎవరితో అనేది ఫిక్స్ కాలేదు. అయితే... జెర్సీ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరితో చరణ్ సినిమా చేయనున్నాడు అని టాక్ వినిపించింది కానీ.. చరణ్‌ ఓకే చెప్పలేదట. అలాగే వంశీ పైడిపల్లి పేరు కూడా తెర పైకి వచ్చింది. వంశీ చెప్పిన స్టోరీ కూడా చరణ్‌ విన్నాడు కానీ.. చరణ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. దీంతో చరణ్‌ ఆర్ఆర్ఆర్ తర్వాత ఎవరితో సినిమా చేయనున్నాడు అనేది ఆసక్తిగా మారింది.
 
లేటెస్ట్ అప్ డేట్ ఏంటంటే.. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌తో చరణ్‌ సినిమా చేయనున్నాడు అని వార్తలు వస్తున్నాయి. చరణ్‌ని హీరోగా ఇంట్రడ్యూస్ చేసింది పూరి జగన్నాథే. అదే.. చిరుత.
ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. అయితే... అప్పటి నుంచి ఇప్పటివరకు మళ్లీ చరణ్‌ - పూరి కలిసి సినిమా చేయలేదు.
 
ఇటీవల చిరు క్యాంపు నుంచి పూరికి ఫోన్ వచ్చిందట. దాని సారాంశం ఏంటంటే... చరణ్‌‌కి సరిపోయే కథ ఉంటే చెప్పండి. సినిమా చేయడానికి చరణ్‌ ఇంట్రెస్ట్‌గా ఉన్నాడని చెప్పారట. పూరి కూడా చరణ్‌‌తో సినిమా చేయడానికి రెడీగా ఉన్నాడు. దీంతో త్వరలోనే చరణ్ - పూరి మధ్య మీటింగ్ జరగనుందని సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

టాయిలెట్‌ పిట్‌లో ఇరుక్కుపోయిన నవజాత శిశువు మృతదేహం.. ఎక్కడ?

ప్రజలు చిత్తుగా ఓడించినా జగన్‌కు ఇంకా బుద్ధిరాలేదు : మంత్రి సత్యకుమార్

కానిస్టేబుల్ కర్కశం... కన్నతల్లిని కొట్టి చంపేశాడు..

ప్రధాని మోడీ భద్రతా వలయంలో లేడీ కమాండో...!!

బాలానగర్ సీతాఫలంకు భౌగోళిక గుర్తింపు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

తర్వాతి కథనం
Show comments