'గరుడవేగ' సూపర్ హిట్... సీక్వెల్ ఉందంటూ టాక్?

హీరో రాజశేఖర్, డైరక్టర్ ప్రవీణ్ సత్తార్ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం "పీఎస్వీ గరుడవేగ". ఈ చిత్రం శుక్రవారం విడుదలైంది. విడుదలైన అన్ని ప్రాంతాల నుంచి ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వస్తోంది.

Webdunia
శనివారం, 4 నవంబరు 2017 (13:54 IST)
హీరో రాజశేఖర్, డైరక్టర్ ప్రవీణ్ సత్తార్ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం "పీఎస్వీ గరుడవేగ". ఈ చిత్రం శుక్రవారం విడుదలైంది. విడుదలైన అన్ని ప్రాంతాల నుంచి ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వస్తోంది. దీంతో చిత్ర యూనిట్ ఫుల్‌ఖుషీగా ఉంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ ఫిల్మ్ నగర్‌లో ఓ టాక్ వినిపిస్తోంది. ఇదే కాంబినేషన్‌లో ఈ చిత్రం సీక్వెల్ ఉందన్నది ఆ టాక్. దీనికి కారణం ఈ సినిమాకి దర్శకుడు ఇచ్చిన ముగింపే. 
 
తనకి అప్పగించిన మిషన్‌ను విజయవంతంగా పూర్తి చేసిన హీరో, ఆ తర్వాత తన ఫ్యామిలీతో కలిసి అకేషన్‌కి వెళతాడు. అక్కడతను తన ఫ్యామిలీతో సరదాగా గడుపుతూ ఉండగా, ఒక్కసారిగా శత్రువులు చుట్టుముడతారు. ఈ సీన్‌పైనే ఎండ్‌టైటిల్స్ పడతాయి. కనుక ఇక్కడి నుంచి సీక్వెల్ మొదలయ్యే అవకాశాలు ఉన్నాయని టాలీవుడ్‌లో చర్చ సాగుతోంది. 
 
అయితే, ఈ చిత్ర దర్శకుడు ప్రవీణ్ సత్తార్ మాత్రం ఈ గుసగుసలుపై ఇంకా స్పందించలేదు. ఆయన స్పందిస్తేగానీ, ఈ చిత్రం సీక్వెల్‌పై వస్తున్న రూమర్లకు ఫుల్‌స్టాఫ్ పడేలా లేదు. మరోవైపు.. సీక్వెల్ చేయడానికి అటు హీరో రాజశేఖర్‌తో పాటు.. ఇటు ఆయన భార్య, నటి జీవిత రాజశేఖర్ కూడా సిద్ధంగా ఉండటం గమనార్హం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అదృశ్యమైన హిందూ బాలిక బురఖా ధరించి ఇంటికి తిరిగి వచ్చింది, అత్యాచారం చేసి పంపారంటూ...

తెలంగాణలో టీజీఎస్సార్టీసీ నిరవధిక సమ్మె.. మహిళలకే కాదు.. పురుష ప్రయాణీకులకు ఫ్రీ జర్నీ

Jagan-KTR: జగన్- కేటీఆర్‌కు ఒకే రకమైన సవాళ్లు.. ఏంటది?

ఏడాదికి 50 వేల మంది రైతులు పాము కాటుతో మరణం, కొత్త పరికరంతో చెక్

నీపై నాకు ఎలాంటి ఫీలింగ్స్ కలగడంలేదు: నిశ్చితార్థమైన యువతితో కాబోయే భర్త, యువతి సూసైడ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవిలో హైడ్రేటెడ్‌గా వుంచే పండ్లు ఇవే

ఉదయాన్నే ఖాళీ కడుపుతో తినదగిన ఆహార పదార్థాలు ఏమిటి?

గోల్డెన్ మిల్క్ హెల్త్ సీక్రెట్స్

గుండె సంబంధ వ్యాధులు రాకుండా వుండాలంటే ఏం చేయాలి?

మూలికల రాజు అశ్వగంధ ఆకుల వినియోగంపై కేంద్రం నిషేధం

తర్వాతి కథనం
Show comments