Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముస్తాఫా రాజాతో ప్రియమణి పెళ్ళి వాయిదా? ఇంతలో తరుణ్‌తో ప్రియమణి పెళ్ళి ఫిక్సయిందా?

ముంబైకి చెందిన ముస్తాఫా రాజా అనే వ్యక్తితో ప్రేమాయణంలో ఉన్న ప్రియమణి పెళ్ళి వాయిదా పడిందట. ముస్తఫా రాజాతో పెళ్లికి ఇంట్లో పెద్దలు కూడా అంగీకరించారని తెలిపిన ప్రియమణి.. ఇంతలోనే తన పెళ్లిని వాయిదా పడేంద

Webdunia
శనివారం, 26 నవంబరు 2016 (12:38 IST)
ముంబైకి చెందిన ముస్తాఫా రాజా అనే వ్యక్తితో ప్రేమాయణంలో ఉన్న ప్రియమణి పెళ్ళి వాయిదా పడిందట. ముస్తఫా రాజాతో పెళ్లికి ఇంట్లో పెద్దలు కూడా అంగీకరించారని తెలిపిన ప్రియమణి.. ఇంతలోనే తన పెళ్లిని వాయిదా పడేందుకు కారణం ఏమిటని కోలీవుడ్‌లో చర్చ సాగుతోంది. దీనిపై ప్రియమణి కూడా స్పందించింది.

ప్రియమణి జాతకం సరిగ్గా లేకపోవడంతోనే పెళ్లి వాయిదా పడిందని చెప్పుకొచ్చింది. ప్రియమణి జాతకం సరిగ్గా లేకపోవడంతో ఈ టైమ్‌లో పెళ్లి చేసుకుంటే భవిష్యత్తులో కష్టాలు తప్పవని ఎవరో పెద్దలు హెచ్చరించారట. అందుకే ప్రియుడు ముస్తాఫా రాజాతో చర్చించి మరీ పెళ్లిని కొన్నాళ్ల పాటు వాయిదా వేసుకుంది ప్రియమణి.
 
ఈ నేపథ్యంలో తరుణ్ పెళ్లి ఫిక్సయిందని వార్తలొస్తున్నాయి. దీనిపై అసలు సంగతి ఏంటా అని ఆరాతీస్తే.. ఇది ఇప్పటి వార్త కాదు. తరుణ్‌, ప్రియమణి కలిసి నటించిన 'నవవసంతం' సినిమా తర్వాతి సంగతి. ప్రియమణి ఇటీవల అలీ నిర్వహించే ఓ షోలో పాల్గొంది. ఈ సందర్భంగా 'నీ మీద వచ్చిన భయంకరమైన గ్యాసిప్‌ ఏంటి' అని ప్రియమణిని అలీ అడిగాడు.
 
అందుకు ప్రియమణి సమాధానం ఇస్తూ.. సినిమాలతోనే బిజీగా గడుపుతున్న రోజుల్లో.. ఓ తమిళ జర్నలిస్ట్‌ తనకు ఫోన్ చేసి.. మీకు హీరో తరుణ్‌తో పెళ్ళి ఫిక్సయిందట కదా అని అడిగాడు. అంతేకాదు.. ఆయన మీకు ఓ లగ్జరీ కారు గిఫ్టుగా ఇచ్చారట కదా అని అడిగాడు. అంతే తనకు ఎక్కడ లేని కోపం వచ్చింది. ఇంటికి వెళ్లి ఏడ్చేశాను. అప్పుడు మా నాన్న ధైర్యం చెప్పారని ప్రియమణి తెలిపింది. నిజానికి అప్పటికి ప్రియమణికి ఇన్నోవా కారు మాత్రమే ఉండేదని చెప్పుకొచ్చింది. ఇది తరుణ్-ప్రియమణిల పెళ్లి కథ.. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

US : అమెరికాలో ప్రమాదం.. కాలి బూడిదైన హైదరాబాద్ వాసులు.. నలుగురు మృతి

హిమాచల్ ప్రదేశ్‌ వరదలు: బ్యాంకు కొట్టుకుపోయింది.. బంగారం, నగదు ఏమైంది?

Roman: రష్యా మంత్రి రోమన్‌ ఆత్మహత్య.. ఎందుకో తెలుసా?

జపాన్‌లో వరుసగా భూకంపాలు- మణిపూర్‌లో భయం భయం.. యుగాంతం ఎఫెక్టేనా?

ప్రేమకు పెద్దలు ఒప్పుకోలేదు.. ప్రేమికుల ఆత్మహత్యాయత్నం.. ప్రేయసి మృతి.. ప్రియుడు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments