Webdunia - Bharat's app for daily news and videos

Install App

జాతీయ హీరో అనుకుంటే బాలీవుడ్‌లో అతిథి పాత్రా.. ప్రభాస్ ఏమైపోతాడో..

బాహుబలి 2 సినిమా విడుదల కాగానే ఆ చిత్ర హీరో ప్రభాస్ అంతర్జాతీయ స్టార్ డమ్‌ సాధించేశాడు. అమరేంద్ర బాహుబలి పాత్రతో కోట్లాది భారతీయుల హృదయాల్లో నిలిచిపోయిన ప్రభాస్‌కు బాలీవుడ్ బ్రహ్మరథం పట్టింది. ప్రభాస్‌తో డైరెక్టు సినిమాలు నిర్మించేందుకు దర్శక-నిర్మాత

Webdunia
బుధవారం, 28 జూన్ 2017 (06:47 IST)
బాహుబలి 2 సినిమా విడుదల కాగానే ఆ చిత్ర హీరో ప్రభాస్ అంతర్జాతీయ స్టార్ డమ్‌ సాధించేశాడు. అమరేంద్ర బాహుబలి పాత్రతో కోట్లాది భారతీయుల హృదయాల్లో నిలిచిపోయిన ప్రభాస్‌కు బాలీవుడ్ బ్రహ్మరథం పట్టింది. ప్రభాస్‌తో డైరెక్టు సినిమాలు నిర్మించేందుకు దర్శక-నిర్మాత కరణ్ జోహార్‌తో పాటు పలువురు బాలీవుడ్ దర్శకులు చర్చలు జరుపుతున్నారు.  కానీ హిందీ తెరపై ఓ స్ట్రైట్‌ సినిమాలో హీరోగా కనిపించే ముందు ప్రభాస్ గెస్ట్‌ రోల్‌లో అలరించనున్నారని భోగట్టా.
 
హిందీ చిత్రం ‘ఖామోషీ’లో ప్రభాస్‌ గెస్ట్‌ రోల్‌ చేయనున్నారనే వార్త షికారు చేస్తోంది. ప్రభుదేవా, తమన్నా జంటగా దర్శకుడు చక్రి తోలేటి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తమిళ ‘కొలైయుదిర్‌ కాలమ్‌’కి రీమేక్‌గా రూపొందుతోన్న ఈ చిత్రంలో కథను మలుపు తిప్పే పాత్ర ఒకటి ఉందట. ఆ పాత్ర కోసం ప్రభాస్‌ని సంప్రదించగా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారని టాక్‌. 
 
ప్రభుదేవా దర్శకత్వం వహించిన ‘పౌర్ణమి’లో హీరోగానూ, తానే దర్శకత్వం వహించిన హిందీ చిత్రం ‘యాక్షన్‌ జాక్సన్‌’లోనూ ప్రభాస్‌ ఓ సాంగ్‌లో కనిపించారు. ఇక, తమన్నాతోనూ ప్రభాస్‌ సినిమాలు చేసిన విషయం తెలిసిందే. ఈ ఇద్దరి కోసం గెస్ట్‌ రోల్‌కి ఒప్పుకున్నారనే ఊహాగానాలు ఉన్నాయి.
 
కానీ ఇలా ప్రారంభ చిత్రంలోనే గెస్ట్ రోల్ లో కనిపిస్తే ప్రేక్షకులు అంచనాలు తారుమారవుతాయేమోనని ప్రభాస్ అభిమానులు కలవరపడుతున్నారు. ఈ వార్తను ఇంకా ఎవరూ నిర్ధారించలేదు కాబట్టి అసలు వార్తకోసం వేచి ఉండాల్సిందే.
 
అన్నీ చూడండి

తాజా వార్తలు

వామ్మో... Cyclone Fengal తుపానులో చెన్నై రన్ వేపై విమానం జస్ట్ మిస్ (Video)

ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ ముఖంపై ద్రవం పోసిన వ్యక్తి

తెలంగాణలో రూ. 200 కోట్ల భారీ అవినీతి తిమింగలం నిఖేష్, ఏసీబి సోదాలు

విశాఖపట్నంలో జరిగిన కేబెల్ స్టార్ సీజన్ 3 విజేతలను ప్రకటించిన ఆర్ఆర్ కేబెల్

జనవరి నుంచి రాజధాని అమరావతి నిర్మాణ పనులు : మంత్రి నారాయణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం
Show comments