ప్రభాస్.. ఏంటి ఈ కన్ఫ్యూజన్?

Webdunia
శుక్రవారం, 20 నవంబరు 2020 (12:09 IST)
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రాథేశ్యామ్ సినిమా చేస్తున్నారు. ఇటీవలే ఇటలీ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది. ఈ సినిమా తర్వాత ప్రభాస్.. ఆదిపురుష్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. రాథేశ్యామ్ ఇటలీ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుని ప్రబాస్ ముంబాయిలో వాలిపోయాడు. ఆదిపురుష్ డైరెక్టర్ ఓంరౌత్‌తో చర్చలు జరిపిన తర్వాత ఈ మూవీకి ఆరు నెలలు డేట్స్ ఇచ్చేందుకు ఓకే చెప్పాడని తెలిసింది.
 
ప్రభాస్‌తో ఫోటో షూట్ కూడా చేసారని సమాచారం. అయితే... ఆదిపురుష్ మూవీని 2022 ఆగష్టు 11న రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. అయితే... ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న రాథేశ్యామ్ మూవీ రిలీజ్ డేట్ను ప్రకటించలేదు కానీ.. ఇంకా స్టార్ట్ చేయని ఆదిపురుష్ మూవీ రిలీజ్ డేట్ ప్రకటించడం ఏంటి అని ఫ్యాన్స్ ఫీలవుతున్నారట.
 
అంతేకాకుండా... రాథేశ్యామ్ రిలీజ్ ఎప్పుడు అనేది క్లారిటీ ఇవ్వాలని ప్రభాస్ పైన ఒత్తిడి పెంచుతున్నారని సమాచారం. మహానటి డైరెక్టర్ నాగ్ అశ్విన్‌తో పాన్ వరల్డ్ మూవీని ప్రకటించారు. ఈ సినిమాని త్వరలోనే స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ సినిమాలో అమితాబ్, దీపికా పడుకునే నటిస్తున్నారు.
 
ఇప్పుడు ఆదిపురుష్ రిలీజ్ డేట్ ప్రకటించడంతో ఈ సినిమా పరిస్థితి ఏంటి..? అనేది హాట్ టాపిక్ అయ్యింది. ఈ సినిమాని ఎప్పుడు స్టార్ట్ చేస్తారో..? రిలీజ్ ఎప్పుడు ఉంటుందో..? అనేది కన్ఫ్యూజన్‌గా ఉంది అంటున్నారు. మరి... ప్రభాస్ త్వరలో క్లారిటీ ఇస్తారేమో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

69 అడుగుల ఎత్తులో ఖైరతాబాద్ బడా గణేష్.. రూ.1 కోటికి పైగా ఖర్చు

మేనమామ వల్ల గర్భం.. ఇంటర్ విద్యార్థిని ఎంత పని చేసిందంటే?

విశాఖలో నవ వధువు ఆత్మహత్య.. కారణం ఏంటి?

జూన్ 26, 2026 శుక్రవారం నాటి తెలుగు రాష్ట్రాల వెదర్ రిపోర్ట్

ఔను... నేను గుంపు మేస్త్రీనే: సీఎం రేవంత్ రెడ్డి, వీడియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నా భార్య గర్భిణీ, ఆమెకి పొటాటో చిప్స్ తినాలని వుందట, తినవచ్చా?

గ్యాస్ట్రిక్ సమస్య వున్నవారు సోంపు తినవచ్చా?

గుండె ఆరోగ్యానికి ఆరోగ్య సూత్రాలు

శరీర కొవ్వును కరిగించే రాగి దోసెలు

గర్భిణీ స్త్రీలు బీట్‌రూట్ తినవచ్చా లేదా?

తర్వాతి కథనం
Show comments