లండ‌న్‌లో శ‌స్త్రచికిత్స చేసుకుంటున్న ప్ర‌భాస్‌!

Webdunia
గురువారం, 28 జులై 2022 (16:11 IST)
Prabhas
రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం ప్రాజెక్ట్ కె. సినిమాలో న‌టిస్తున్నాడు. దానితోపాటు రెండు సినిమాలు లైన్‌లో వున్నాయి. అయితే తాజా స‌మాచారం మేర‌కు ప్ర‌భాస్ ప్ర‌స్తుతం విదేశాల్లో ట్రీట్‌మెంట్ చేసుకుంటున్నాడు. ఇటీవ‌లే రామోజీ ఫిలింసిటీలో ప్రాజెక్ట్ కె. షూటింగ్‌లో అమితాబ్‌, దీపికాప‌దుకొనే, ప్ర‌భాస్‌కు సంబంధించిన కీల‌క స‌న్నివేశాలు చిత్రీక‌రించారు. అనంత‌రం జ‌రిగిన ఓ యాక్ష‌న్ ఎపిసోడ్‌తో ఆయ‌న ఎడ‌మ‌కాలికి తీవ్ర‌గాయ‌మైంద‌ని తెలిసింది.
 
అందుకే కాలికి చిన్న‌పాటి శ‌స్త్రచికిత్స చేసుకోవాల్సిరావ‌డంతో షూటింగ్ వాయిదా వేశారు. ఈ చిత్రం నెల‌రోజుల‌పాటు షూటింగ్ వాయిదా ప‌డింది. విశేసం ఏమంటే, అశ్వ‌నీద‌త్ నిర్మాణంలో రూపొందిన `సీతా రామం` ప్రీరిలీజ్ వేడుక హైద‌రాబాద్‌లో జ‌ర‌గ‌నుంది. దీనికి ముఖ్య అతిథిగా ప్ర‌భాస్ హాజ‌రుకావాల్సి వుంది. కానీ ప‌బ్లిక్ నుద్దేశించి ప్ర‌భాస్ కాలును దృష్టిలో పెట్టుకుని ఆన్‌లైన్లో ఆయ‌న విషెస్ చెప్పేలా నిర్వాహ‌కులు చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. ప్ర‌భాస్ త్వ‌ర‌లో కోలుకుని షూటింగ్‌లో పాల్గొన‌నున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సూపర్ క్లోరినేషన్, సూపర్ శానిటేషన్‌ను వెంటనే ప్రారంభించాలి.. పవన్ కల్యాణ్

ISRO: సీఎంఎస్-03 కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని ప్రయోగించనున్న ఇస్రో

Millionaire: యూఏఈ భారతీయుడి జీవితంలో అద్భుతం.. తల్లి వల్ల రూ.240 కోట్ల జాక్ పాట్.. ఎలా?

కారు సైడ్ మిర్రర్‌కు బైక్ తాకిందని కారుతో గుద్ది చంపేసిన కపుల్ (video)

గుజరాత్‌లో బాలికపై సామూహిక అత్యాచారం.. పొలాల్లోకి లాక్కెళ్లి ..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments