కన్నప్పలో ప్రభాస్ శివుడిగా ఇలా వుంటాడు !

డీవీ
మంగళవారం, 13 ఫిబ్రవరి 2024 (10:43 IST)
Prabhas -kannappa
రెబల్ స్టార్ ప్రభాస్ కీలకపాత్రలాంటిది మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న చిత్రం కన్నప్పలో చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులోదక్షిణాది స్టార్ లు మోహన్ లాల్, శివరాజ్ కుమార్ కూడా నటిస్తున్నారు. బ్రో, లాల్ సలామ్, ఆచార్య సినిమాలలో నటించినట్లుగా స్టార్ హీరోలు కన్నప్పలో నటించడం విశేషం. కాగా ఈ చిత్రం షూటింగ్ ఆమద్య న్యూజిలాండ్ లో ముగించుకుని తిరిగి హైదరాబాద్ వచ్చింది. అప్పుడు అక్కడ మైన్ డిగ్రీల వాతావరణంలో వుండేది.
 
తాజాగా, రెండు రోజుల క్రితమే మంచు మోహన్ బాబు, విష్ణు తన టీమ్ తో న్యూజిలాండ్ వెళ్ళారు. దాదాపు 35 రోజులపాటు చిత్రీకరణ జరపనున్నారు. ఈ షెడ్యూల్ కీలకమైంది. దీనితో షూటింగ్ కు ముగింపు కార్డ్ పడనుంది. ఈ షెడ్యూల్ లో ప్రభాస్ పాత్ర శివుడుగా వుంటుందని సమాచారం. గతంలో క్రుష్ణంరాజు గారు నటించిన భక్త కన్నప్ప సినిమాకు మోడర్ నైజేషన్ సినిమా ఇది.
 
క్రుష్ణంరాజుగారు ప్రభాస్ కన్నప్ప తరహా సినిమా చేయాలనే చెబుతుండేవారు. కానీ ప్రభాస్ బిజీ షెడ్యూల్ వల్ల అది సాధ్యపడలేదు. ఎట్టకేలకు మంచు విష్ణు ద్వారా ఈ అవకాశం వచ్చిందని ఆయన సన్నిహితులు చెబుతుంటారు. సోషల్ మీడియాలో ప్రభాస్ ఫ్యాన్స్ శివుడి గెటప్ లో చూసి తెగ సంబరపడిపోయారు. ఫ్యాన్స్ సమాచారం ప్రకారం శివుడిగా ప్రభాస్ అద్భుతంగా వున్నాడని త్వరలో మరిన్ని వివరాలతో ముందుకు వస్తామని అంటున్నారు.

ఇప్పటికే ప్రభాస్ ఆదిపురుష్ లో రాముడి గెటప్ వేసి చాలామందిని సర్ ప్రైజ్ చేశారు. మీసాల రాముడిగా వున్నాడంటూ విమర్శలు కూడా వచ్చాయి. ఒరిజినల్ గా రాముడికి మీసాలు వుంటాయి. కానీ మన పూర్వీకులు మీసాలు లేని రాముడినే ఆదర్శంగా తీసుకోవడం విశేషం. మరి రేపు రాబోయే శివుడు గెటప్ లో ప్రభాస్ ను ఏ కోణంలో చూపించారో  కొద్దికాలం ఆగాల్సిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సౌదీ అరేబియాను ముంచెత్తుతున్న వర్షాలు, రెడ్ అలెర్ట్

జగన్ మతంలో జరిగివుంటే ఇలాగే స్పందించేవారా? పవన్ కళ్యాణ్

కాంగ్రెస్ ఓటమికి ఆ పార్టీ నాయకత్వమే కారణం : అమిత్ షా

ప్రేమ వ్యవహారం : క్రికెట్ బ్యాటుతో కొట్టి విద్యార్థిని చంపేశారు...

దారుణం, బాలికపై లైంగిక దాడి చేసి ప్రైవేట్ పార్టులో...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సీజనల్ ఫ్రూట్ రేగు పండ్లు తింటే ప్రయోజనాలు ఏమిటి?

అధునాతన క్యాన్సర్ చికిత్సకై టాటా మెమోరియల్ ఎసిటిఆర్ఇసితో కోటక్ మహీంద్రా భాగస్వామ్యం

winter health, తులసి పొడిని తేనెలో కలిపి తాగితే...

తమలపాకులు ఎందుకు వేసుకోవాలి?

సులభంగా శరీర బరువును తగ్గించే మార్గాలు

తర్వాతి కథనం
Show comments