Webdunia - Bharat's app for daily news and videos

Install App

త్రివిక్రమ్ దర్శకత్వంలో ప్రభాస్.. భారీ బడ్జెట్‌తో సినిమా...!

'బాహుబలి' సినిమాతో తెలుగు సినీపరిశ్రమలో కొత్త ట్రెండ్ సృష్టించిన హీరో ప్రభాస్ ప్రస్తుతం "సాహో" సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న 'సాహో' సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా స

Webdunia
ఆదివారం, 17 సెప్టెంబరు 2017 (14:48 IST)
'బాహుబలి' సినిమాతో తెలుగు సినీపరిశ్రమలో కొత్త ట్రెండ్ సృష్టించిన హీరో ప్రభాస్ ప్రస్తుతం "సాహో" సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న 'సాహో' సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది. అయితే సినిమా షూటింగ్ జరుగుతుండగానే ప్రభాస్‌కు బంపర్ ఆఫర్ వచ్చింది. ప్రభాస్ కోసం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఒక కథను సిద్ధం చేసి స్వయంగా కాల్ చేసి చెప్పినట్టు ఫిల్మ్ వర్గాల సమాచారం. ప్రభాస్ బాడీ లాంగ్వేజ్‌కు సరిపోయేలా ఈ కథ ఉందట. 
 
"మనం తీయబోయే సినిమా భారీ బడ్జెట్... అయితే సమయం కాస్త ఎక్కువవతుంది. ఓపిగ్గా ఉండాలి. సినిమా పూర్తయి రిలీజైతే మంచి పేరు సంపాదించుకోవచ్చు. సినిమా షూటింగ్ మొత్తం విదేశాలలోనే ఉంటుంది. సమయం ఎక్కువగా కేటాయించాల్సి ఉంటుంది. మొత్తం ముగ్గురు హీరోయిన్లు ఉంటారు. కథ నేను నేరుగా వచ్చి కలిసి మాట్లాడుతా" అంటూ ఫోన్‌లో త్రివిక్రమ్ చెప్పారట. 
 
త్రివిక్రమ్ వంటి స్టార్ డైరెక్టర్ స్వయంగా ఫోన్ చేసి సినిమా తీస్తానంటే ఎవరు మాత్రం వద్దంటారు చెప్పండి. ప్రభాస్ కూడా అదే చేశారు. మీ ఇష్టం త్రివిక్రమ్ గారు.. అంటూ సమాధానమిచ్చారట. ఇప్పటికే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌‌‍తో సినిమాలు చేసి తెలుగు సినీపరిశ్రమలో కొత్త ట్రెండ్ సృష్టించిన త్రివిక్రమ్ ప్రభాస్‌తో ఎలాంటి సినిమా చేయబోతాడన్నదే ఇపుడు ఆసక్తిగా మారింది. సినిమా కథను త్రివిక్రమ్ ఇప్పటికే సిద్ధం చేసినా షూటింగ్ మాత్రం ఆలస్యం కానుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారతదేశపు అంతర్జాతీయ బయోఫార్మా ఆశయాలకు మద్దతు ఇస్తోన్న ఎజిలెంట్

ఏపీలో ఇక స్మార్ట్ రేషన్ కార్డులు.. మంత్రి నాదెండ్ల వెల్లడి

US: పడవ ప్రయాణం.. వర్జీనియాలో నిజామాబాద్ వ్యక్తి గుండెపోటుతో మృతి

కన్నతండ్రి అత్యాచారం.. కుమార్తె గర్భం- ఆ విషయం తెలియకుండానే ఇంట్లోనే ప్రసవం!

TGSRTC: హైదరాబాద్- విజయవాడ మధ్య బస్సు సర్వీసులపై టీజీఎస్సార్టీసీ తగ్గింపు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments