Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

"ఉంగరాల రాంబాబు"కి 'సైరా'లో కీలకమైన రోల్

తెలుగు చిత్ర పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవిని అమితంగా ప్రేమించే, అభిమానించే నటీనటుల్లో హీరో కమ్ కమెడియన్ సునీల్ ఒకరు. ఈయన కమెడియన్ నుంచి హీరో స్థాయికి ఎదిగాడు. ఆరంభంలో మంచి హిట్స్‌ను తన ఖాతాలో వేసుకున్

Advertiesment
ungarala rambabu
, ఆదివారం, 17 సెప్టెంబరు 2017 (11:47 IST)
తెలుగు చిత్ర పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవిని అమితంగా ప్రేమించే, అభిమానించే నటీనటుల్లో హీరో కమ్ కమెడియన్ సునీల్ ఒకరు. ఈయన కమెడియన్ నుంచి హీరో స్థాయికి ఎదిగాడు. ఆరంభంలో మంచి హిట్స్‌ను తన ఖాతాలో వేసుకున్నప్పటికీ.. ఇటీవలి కాలంలో వరుస పరాజయాలను చవిచూస్తున్నాడు. 
 
ఈ క్రమంలో 'ఉంగరాల రాంబాబు' ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా తాను ఆశించిన ఫలితాన్ని అందించడం ఆనందంగా ఉందని సునీల్ చెప్పాడు. ప్రస్తుతం రెండు సినిమాలు సెట్స్‌పై ఉన్నాయని అన్నాడు.
 
ఇక చిరంజీవి 151వ చిత్రం సైరా నరసింహా రెడ్డిపై సునీల్ స్పందిస్తూ.. నిజానికి చిరంజీవి 150వ సినిమాలోనే తాను చేయవలసి ఉన్నప్పటికీ కొన్ని కారణాల వలన కుదరలేదనీ, కానీ, 151వ సినిమాగా రూపొందుతోన్న 'సైరా నరసింహా రెడ్డి'లో తనకి చోటు దొరకడం అదృష్టమన్నాడు. 
 
ఈ సినిమాలో తాను ఒక ముఖ్యమైన పాత్రను చేస్తున్నానని అన్నాడు. ఇకపై ఒకవైపున హీరోగా చేస్తూనే .. మరో వైపున కమెడియన్ గాను కనిపిస్తాననీ, విలన్ పాత్రలు చేయడానికి కూడా ఎంతమాత్రం వెనుకాడనని చెప్పుకొచ్చాడు. ఈ చిత్రంలో బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ కూడా నటిస్తున్న విషయం తెల్సిందే. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఐదేళ్ళ క్రితం పడకసుఖం ఇవ్వమన్నారు... మణిరత్నం హీరోయిన్