Webdunia - Bharat's app for daily news and videos

Install App

'జిగేల్ రాణి'కి కళ్లు నెత్కికెక్కాయా? టాలీవుడ్‌పై మోజు తీరిందా??

Webdunia
ఆదివారం, 8 నవంబరు 2020 (10:23 IST)
తెలుగు చిత్రపరిశ్రమలోని స్టార్ హీరోయిన్లలో పూజా హెగ్డే ఒకరు. ప్రతి ఒక్క స్టార్ హీరోతో నటిస్తూ అగ్ర హీరోయిన్‌గా కొనసాగుతోంది. పైగా, ఈ అమ్మడు నటిస్తున్న చిత్రాలు వరుస హిట్లు సాధిస్తున్నాయి. దీంతో ప్రతి నిర్మాత ఈమె కోసం వెంపర్లాడుతున్నారు. ఇదే ఈ అమ్మడుకు కలిసివచ్చింది. దీంతోపాటు.. గర్వం కూడా పెరిగింది. ఫలితంగానే.. తల బిరుసుగా మాట్లాడుతూ, కూర్చొన్న కొమ్మనే నరుక్కునేలా ప్రవర్తిస్తోది. ఇందుకు నిదర్శనం తాజాగా ఈ అమ్మడు తాజాగా చేసిన వ్యాఖ్యలే. 
 
ఈ అమ్మడుకి స్టార్ ఇమేజ్ తెచ్చిపెట్టిన ఇండస్ట్రీని అందరి ముందు తక్కువ చేసి మాట్లాడుతోంది. ఈమెను మన దర్శక నిర్మాతలు నెత్తిన పెట్టుకున్నారు.. ఆడియన్స్ గుండెల్లో పెట్టుకున్నారు.. కానీ ఈమె మాత్రం సౌత్ ఇండస్ట్రీపై చీప్ కామెంట్స్ చేసింది. ఇక్కడి వాళ్లకు నడుము పిచ్చి ఉందంటూ కాంట్రవర్సీ కామెంట్స్ చేసింది. తెలుగు ఇండస్ట్రీ నుంచి బాలీవుడ్‌కు వెళ్లి అక్కడ మంచి అవకాశాలనే దక్కించుకుంది. 
 
ప్రస్తుతం సల్మాన్ ఖాన్ వంటి స్టార్ హీరోలతో నటిస్తుంది. తెలుగులో కూడా ప్రస్తుతం ప్రభాస్‌తో "రాధే శ్యామ్".. అఖిల్‌తో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలు చేస్తుంది. ఈ రెండింటి తర్వాత అవకాశాలు వస్తున్నా కూడా ఒప్పుకోవడం లేదు. ఇకపై తన ఫోకస్ అంతా హిందీ సినిమాలపైనే అంటుంది ఈ అమ్మడు. 
 
అందుకే ఇక్కడ ఇండస్ట్రీని తక్కువ చేసి మాట్లాడుతుందేమో అంటూ సెటైర్లు వేస్తున్నారు. దక్షిణాది సినిమాలపై ఇక్కడి ఆడియన్స్‌పై చేసిన కొన్ని కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. దక్షిణాది ప్రేక్షకులకు నడుము చూసే అలవాటు ఉందని.. వాళ్లంతా అదే మత్తులో ఉంటారని చెప్పుకొచ్చింది. ఈ తరహా సిల్లీ కామెంట్స్‌పై తెలుగు ప్రేక్షకులు మండిపడుతున్నారు. 
 
అంత చూపించకూడదని అనుకున్నపుడు ఇండస్ట్రీకి ఎందుకొచ్చావు.. వచ్చావు సరే ఎందుకు చూపించావు అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇన్ని రోజులు కోట్లాది రూపాయలను తీసుకుని బాగానే నడుము చూపించావు కదా.. మళ్లీ ఇప్పుడు ఎందుకు అలాంటి చీప్ కామెంట్స్ చేస్తున్నావ్ అంటూ మండి పడుతున్నారు. 
 
అసలు అన్నం పెట్టిన ఇండస్ట్రీపై ఇలాంటి మాటలు ఎలా మాట్లాడతావ్ అంటూ ఫైర్ అవుతున్నారు. దీనిపై పూజా మాత్రం నవ్వుతూనే సమాధానం చెప్తుంది. అదంతా సిల్లీగానే అన్న మాటలు అంటుంది ఈ ముద్దుగుమ్మ. గతంలో తాప్సీ, ఇలియానా, రాధికా ఆప్టే లాంటి హీరోయిన్లు కూడా తెలుగు ఇండస్ట్రీలో నటించి గుర్తింపు తెచ్చుకుని.. ఆ తర్వాత టాలీవుడ్‌పైనే కామెంట్స్ చేసారు. చివరకు ఇటు టాలీవుడ్, అటు బాలీవుడ్ చిత్రపరిశ్రమల్లో అవకాశాలు లేకుండా రెంటికీ చెడ్డ రేవడిలా తయారయ్యారు. ఇపుడు ఈ అమ్మడుకు కూడా అదే పరిస్థితి ఉత్పన్నమైనా ఆశ్చర్యపోనక్కర్లేదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Mumbai Boat Accident: ప్రయాణికుల బోటును నేవీ బోటు ఢీకొట్టడంతో 13 మంది మృతి, పలువురు గల్లంతు (video)

Live accident, గుంటూరు-విజయవాడ హైవేపై పట్టపగలే కారుతో ఢీకొట్టేసాడు (video)

తిరుమల పవిత్రతను కాపాడండి.. పబ్ కల్చర్ వచ్చేసింది.. భూమన కరుణాకర్ రెడ్డి

కేరళలో మళ్ళీ మంకీపాక్స్ కేసులు - ఇద్దరికీ పాజిటివ్ కేసులు

ప్రపంచ వ్యాప్తంగా 2025లో వలస విధానాలు మారనున్నాయా, అమెరికాకు వెళ్లడం కష్టమవుతుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పీచు పదార్థం ఎందుకు తినాలి?

కరక్కాయ దేనికి ఉపయోగిస్తారు, ప్రయోజనాలు ఏమిటి?

winter drinks శీతాకాలంలో ఆరోగ్యాన్నిచ్చే డ్రింక్స్

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments