Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇటు టాలీవుడ్ అటు బాలీవుడ్.. ఊపేస్తున్న జిగేల్ రాణి!! (video)

Webdunia
మంగళవారం, 26 మే 2020 (11:43 IST)
తెలుగు చిత్ర పరిశ్రమలో ఇపుడు టాప్ రేంజ్‌లో దూసుకునిపోతున్న హీరోయిన్న ఎవరయ్యా అంటే.. ఠక్కున చెప్పే పేరు జిగేల్ రాణి అలియాస్ పూజా హెగ్డే. ఇపుడు ఈ అమ్మడు పట్టిందల్లా బంగారంగా మారిపోతోంది. అంటే.. పూజా నటించే ప్రతి చిత్రం సూపర్ హిట్ అవుతోంది. దీంతో దర్శక నిర్మాతలు ఈ అమ్మడు కోసం క్యూకడుతున్నారు. ఇది టాలీవుడ్‌లో పరిస్థితి. మరోవైపు, అటు బాలీవుడ్‌లోనూ ఈ అమ్మడు దూసుకునిపోతోంది. 
 
నిజానికి ఈ అమ్మడు ఖాతాలో వరుస హిట్లు పడుతున్నాయి. దీంతో విపరీతమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ వచ్చేసింది. గ్లామర్ పాత్రలకు కేరాఫ్ అడ్రస్ అయిపోయింది. ఇదే అదునుగా భావించిన ఈ ముద్దుగుమ్మ పారితోషికాన్ని అమాంతం పెంచేసింది. అయినప్పటికీ, పూజానే కావాలంటూ దర్శక నిర్మాతలు ఆమె డేట్స్ కోసం ఎదురు చూస్తున్నారు. 
 
ఈ క్రమంలో అటు తెలుగులోనూ, ఇటు హిందీలోనూ పలు చిత్రాల్లో నటించేందుకు కమిట్ అవుతోంది. హిందీలో సల్మాన్ ఖాన్ హీరోగా రూపొందే 'కబీ ఈద్ కబీ దివాలీ' సినిమాలోను, అక్షయ్ కుమార్ నటించే 'బచ్చన్ పాండే' చిత్రంలోనూ హీరోయిన్‌గా నటించడానికి పూజ ఇప్పటికే డేట్స్ ఇచ్చేసింది.
 
ఇకపోతే, ఇటు తెలుగులో కూడా పలు ప్రాజెక్టుల్లో కమిట్ అయింది. ముఖ్యంగా, హీరో ప్రభాస్ చిత్రంలోనూ, 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' చిత్రంలోనూ నటిస్తోంది. తాజాగా మలయాళ యువ హీరో దుల్ఖర్ సల్మాన్ సరసన హీరోయిన్‌గా నటించడానికి ఓకే చెప్పింది. 
 
హను రాఘవపూడి దర్శకత్వం వహించే ఈ చిత్రాన్ని అశ్వనీదత్ కూతుర్లు స్వప్నా దత్, ప్రియాంక దత్ కలసి నిర్మిస్తారు. ఇలా ఈ జిగేల్ రాణి అటు బాలీవుడ్.. ఇటు టాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉందన్నమాట! 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Kodali Nani: కొడాలి నాని ఆరోగ్య పరిస్థితిపై ఫోనులో ఆరా తీసిన జగన్.... ఆస్పత్రికి వెళ్లలేరా?

Polavaram: 2027 చివరి నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి: చంద్రబాబు ప్రకటన

Revanth Reddy: తెలంగాణ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి, కేటీఆర్‌ల జైలు కథలు..

Aarogyasri: ఏపీలో ఏప్రిల్ 7 నుంచి ఆరోగ్య శ్రీ సేవలు బంద్?

Putin: భారత్‌లో పర్యటించనున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments