Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాక్ మాజీ క్రికెటర్‌తో టాలీవుడ్ తార తమన్నా పెళ్లి? పాత ఫోటో వైరల్

Webdunia
బుధవారం, 6 మే 2020 (16:45 IST)
పాకిస్థాన్ మాజీ క్రికెటర్ అబ్దుల్ రజాక్. బౌలర్‌తో పాటు బ్యాట్స్‌మెన్‌గా రాణించాడు. దీంతో పాకిస్థాన్‌లో మంచి పేరున్న క్రికెటర్. అయితే, ఇపుడు ఈ క్రికెటర్‌తో కలిసి టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా డేటింగ్ చేసిందా? లేదా పెళ్లి చేసుకోనుందా? అనే వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఎందుకంటే.. వీరిద్దరూ ఓ బంగారు నగల షాపులో కలిసిదిగిన ఫోటో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 
 
ముఖ్యంగా, టాలీవుడ్ నటి తమన్నా అబ్దుల్ రజాక్‌కు పెళ్లి చేసుకోబోతోందనే ప్రచారం సాగుతోంది. ఎందుకంటే.. హైదరాబాద్ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా పాక్ మాజీ క్రికెట్ షోయబ్ మాలిక్‌ను పెళ్లి చేసుకుని ఓ బిడ్డకు తల్లి అయిన విషయం తెల్సిందే. ఇపుడు తమన్నా కూడా సానియానే ఫాలోఅవుతుందనే ప్రచారం సాగుతోంది. 
 
అయితే, తమన్నా తరపున ఓ పబ్లిక్ రిలేషన్ సంస్థ ఈ ఫోటోపై వివరణ ఇచ్చింది. కొన్నేళ్ళ క్రితం దుబాయ్‌లో జరిగిన ఓ బంగారు షాపు ప్రారంభోత్సవానికి తమన్నాతో పాటు.. అబ్దుల్ రజాక్‌ను కూడా ఆహ్వానించామని తెలిపారు. ఆ షాపు ఓపెనింగ్ సమయంలో వారిద్దరూ కలిసి ఫోటో అని వివరణ ఇచ్చింది. కాగా, ఇటీవల తమన్నా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కూడా తాను ఇంకా బ్రహ్మచారిణిగానే ఉన్నట్టు స్పష్టం చేసిన విషయం తెల్సిందే. 
 
సాధారణంగా సినీ తారలు, క్రికెటర్లకు విపరీతమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంటుంది. వారి వ్యక్తిగత అంశాలపై అభిమానులు ప్రత్యేకంగా శ్రద్ధ చూపిస్తుంటారు. ముఖ్యగా, ఫోటోలు, వీడియోలు అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. అదేక్రమంలో ఇపుడు కూడా తమన్నా, అబ్దుల్ రజాక్ ఫోటో కూడా వైరల్ అయిందని చెప్పొచ్చు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Revanth Reddy: తెలంగాణ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి, కేటీఆర్‌ల జైలు కథలు..

Aarogyasri: ఏపీలో ఏప్రిల్ 7 నుంచి ఆరోగ్య శ్రీ సేవలు బంద్?

Putin: భారత్‌లో పర్యటించనున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్..

HIV: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం.. హెచ్ఐవీ ఇన్ఫెక్షన్లు పెరిగిపోతాయ్!

14 ఏళ్ల క్రితం తప్పిపోయిన కొడుకుని తిరిగి కలుసుకున్న తల్లిదండ్రులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments