క్రిష్ ప్రయత్నం ఫలించింది.. ఇంతకీ ఏంటది...?

Webdunia
శుక్రవారం, 13 నవంబరు 2020 (15:19 IST)
"గమ్యం, వేదం, కంచె" ఇలా విభిన్న కథా చిత్రాలను అందించి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు ఏర్పరుచుకున్న డైరెక్టర్ క్రిష్. 'ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు' చిత్రాల తర్వాత క్రిష్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో సినిమా స్టార్ట్ చేశారు. ఇది పవన్ కళ్యాణ్ చేస్తున్న ఫస్ట్ పాన్ ఇండియా మూవీ కావడం విశేషం. ఈ చిత్రాన్ని సీనియర్ ప్రొడ్యూసర్ ఎ.ఎం.రత్నం నిర్మిస్తున్నారు. 
 
కరోనాకు ముందు ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయ్యింది. సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తుంటే కరోనా వచ్చింది. ఈ మూవీ షూటింగ్ ఆగింది. అయితే... 'వకీల్ సాబ్' షూటింగులో పవన్ జాయిన్ అయ్యారు. దీంతో నెక్ట్స్ తన సినిమా షూటింగులోనే జాయిన్ అవుతారు అనుకుంటే... వైల్డ్ కార్డ్ ఎంట్రీలా "అయ్యప్పన్ కోషియమ్" రీమేక్‌కి పవన్ ఓకే చెప్పారు. 
 
'వకీల్ సాబ్' షూటింగ్ పూర్తి చేసి క్రిష్ మూవీ షూటింగుకి కాకుండా.. 'అయ్యప్పన్ కోషియమ్' రీమేక్‌కి డేట్స్ ఇచ్చారు. దీంతో క్రిష్... 'వకీల్ సాబ్' తర్వాత తనకు డేట్స్ ఇవ్వాలని పవన్‌ని అడిగారు. ఓ పది రోజులు ఇచ్చినా ఓ షెడ్యూల్ కంప్లీట్ చేస్తానన్నారు. ఆఖరికి క్రిష్ ప్రయత్నం ఫలించింది. పవన్ కరుణించారు. పది రోజులు షూట్ చేసుకోవడానికి వపన్ ఓకే అన్నారు. 
 
డిసెంబరులో పది రోజులు కాల్ షీట్ల ఇచ్చారు. అల్యూమినియం ఫ్యాకర్టీలో వేసిన సెట్లో వున్న బ్యాలన్స్ పనిని పూర్తి చేస్తారు. ఆ తర్వాత పవన్ 'అయ్యప్పన్ కోషియమ్' రీమేక్ మీదకు వెళ్తారు. అది పూర్తయ్యాకనే మళ్లీ క్రిష్ సినిమాకు వస్తారు. డిసెంబరులో క్రిష్ మూవీ షూటింగ్ చేసిన తర్వాత మళ్లీ ఈ మూవీ షూటింగ్ చేయడానికి ఓ రెండు నెలలు పట్టచ్చు. షెడ్యూల్ షెడ్యూలుకి ఇంత గ్యాప్ వస్తే.. ఎప్పటికీ పూర్తవుతుందో..? ఎప్పటికి ప్రేక్షకుల ముందుకు వస్తుందో..?

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

YS Jagan: 60 రోజులు అసెంబ్లీకి రాకపోతే.. వైకాపా చీఫ్ జగన్ సీటు ఏమౌతుంది?

Naga Babu vs Balakrishna: నాగబాబు - బాలయ్యతో ఏపీ సీఎం చంద్రబాబుకు తలనొప్పి?

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శుభవార్త- రాష్ట్రంలో కొత్త హై స్పీడ్ రైలు కారిడార్లు

ప్రజలు కోరుకుంటే రాజకీయ పార్టీ పెడతా.. కల్వకుంట్ల కవిత (video)

Friendship: స్నేహం అత్యాచారం చేసేందుకు లైసెన్స్ కాదు.. ఢిల్లీ హైకోర్టు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments