Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్ ఫ్యాన్స్‌కు డబుల్ ధమాకా -టైటిల్ మార్చనున్నారా..? (video)

Webdunia
శనివారం, 18 జులై 2020 (13:42 IST)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ పుట్టినరోజు సెప్టెంబర్ 2న. ఆ రోజు అభిమానులకు పండగ రోజు. అయితే... ఈసారి సెప్టెంబర్ 2 ఇంకా చాలా రోజులు ఉందనగానే అభిమానులు సోషల్ మీడియాలో సందడి మొదలు పెట్టేసారు. అయితే... ఈసారి పవన్ పుట్టినరోజున అభిమానులకు డబుల్ ధమకా అని తెలిసింది. ఇంతకీ విషయం ఏంటంటే... పవర్ స్టార్ నటిస్తున్న తాజా చిత్రం వకీల్ సాబ్. ఈ చిత్రానికి ఎంసీఏ డైరెక్టర్ వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నారు.
 
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పైన దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీ టీజర్‌ను పవన్ పుట్టినరోజు కానుకగా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఆల్రెడీ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్. తమన్ అందించిన సాంగ్‌కు అనూహ్యమైన స్పందన రావడంతో ఇక మిగిలిన పాటలు ఇంకెలా ఉంటాయో అనే ఆసక్తి ఏర్పడింది. దీనికితోడు ఇప్పుడు టీజర్ రానుందని తెలిసినప్పటి నుంచి ఎప్పుడెప్పుడు వకీల్ సాబ్ టీజర్ వస్తుందా అని ఫ్యాన్స్ వెయిటింగ్.
 
ఇదిలా ఉంటే.. పవన్ ఫ్యాన్స్‌కు డబుల్ ధమాకా అంటూ మరో వార్త తెలిసింది. అది ఏంటంటే... పవన్ కళ్యాణ్ క్రిష్ డైరెక్షన్లో మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీకి విరూపాక్షి అనే టైటిల్ ఖరారు చేసారంటూ ప్రచారం జరిగింది.

తాజాగా ఈ చిత్రానికి బందిపోటు అనే టైటిల్ పెట్టాలనుకుంటున్నారని టాక్ వినిపిస్తోంది. దీనితో పాటు మంచిదొంగ, చోర అనే టైటిల్స్ కూడా వినిపిస్తున్నాయి. ఇప్పటివరకు టైటిల్ ఫిక్స్ చేయలేదు కానీ.. పుట్టినరోజుకు టైటిల్ ఖరారు చేసి ఎనౌన్స్ చేయనున్నారని సమాచారం. ఇదే కనుక జరిగితే... పవన్ ఫ్యాన్స్‌కి డబుల్ ధమాకాతో పండగే...!

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నీ భర్త వేధిస్తున్నాడా? నా కోరిక తీర్చు సరిచేస్తా: మహిళకు ఎస్.ఐ లైంగిక వేధింపులు

గూగుల్ మ్యాప్ ముగ్గురు ప్రాణాలు తీసింది... ఎలా? (video)

ప్రేయసిని కత్తితో పొడిచి నిప్పంటించాడు.. అలా పోలీసులకు చిక్కాడు..

నీమచ్‌లో 84,000 చదరపు అడుగుల మహాకాయ రంగోలి ఆసియా వరల్డ్ రికార్డు

పోసాని కృష్ణమురళి రెడ్డి అని పేరు పెట్టుకోండి: పోసానిపై నటుడు శివాజి ఆగ్రహం (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments