Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్ కళ్యాణ్ "కాటమరాయుడు" నుంచి మరొకరు ఔట్... షూటింగ్ పూర్తయ్యేనా?

హీరో పవన్ కళ్యాణ్ కొత్త చిత్రం కాటమరాయుడు. ఈ చిత్రం షూటింగ్‌ను ఏ ముహుర్తానా ప్రారభించారో కానీ, అన్నీ అడ్డంకులే ఎదురవుతున్నాయి. ఇప్పటికే ఈ చిత్రం దర్శకుడిని మార్చేసిన పవన్ కళ్యాణ్.. తాజాగా కెమెరామెన్‌న

Webdunia
ఆదివారం, 25 సెప్టెంబరు 2016 (15:58 IST)
హీరో పవన్ కళ్యాణ్ కొత్త చిత్రం కాటమరాయుడు. ఈ చిత్రం షూటింగ్‌ను ఏ ముహుర్తానా ప్రారభించారో కానీ, అన్నీ అడ్డంకులే ఎదురవుతున్నాయి. ఇప్పటికే ఈ చిత్రం దర్శకుడిని మార్చేసిన పవన్ కళ్యాణ్.. తాజాగా కెమెరామెన్‌ను కూడా మార్చేశారు. 
 
నిజానికి 'కాటమరాయుడు' రెగ్యులర్ షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. కానీ పవర్ స్టార్ మాత్రం శనివారం నుంచి షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. అయితే.. తాజాగా ఈ సినిమాలో మరొకరిని తొలగించారు. తొలుత డైరెక్టర్‌గా ఎస్‌జే సూర్యను అనుకున్నా.. కారణమేదైనా గానీ అతడి ప్లేస్‌ను డాలీ భర్తీ చేసేశాడు. 
 
ఇపుడు కెమెరామెన్‌ను తప్పించారు. తొలుత 'బెంగాల్ టైగర్'కు సినిమాటోగ్రఫి అందించిన సౌందర్ రాజన్‌ను తీసుకున్నారట. కానీ అనుకున్న టైమ్‌కి సినిమా స్టార్ట్ కాకపోవడంతో.. ఈ మూవీ నుంచి తప్పుకున్నాడట ఈ స్టార్ టెక్నీషియన్. ప్రస్తుతం అతని స్థానంలో 'అత్తారింటికి దారేది'కి పనిచేసిన ప్రసాద్ మూరేళ్లను ఫైనల్ చేశారని సమాచారం. ప్రసాద్ రాకతో పవన్ మూవీ షూటింగ్ స్పీడందుకుంటుందని మూవీ యూనిట్ అంటోంది. 
 
అయితే.. పవన్ సినిమాకు ఇలా టెక్నీషియన్లు మారడం కొత్తేం కాదు. గతంలో 'సర్దార్ గబ్బర్ సింగ్' విషయంలోనూ కెమెరామెన్లు మారారు. తాజాగా 'కాటమరాయుడు'కూ అదే జరిగింది. దీంతో ఈ సినిమాలో మున్ముందు ఇంకెన్ని మార్పులు- చేర్పులు జరుగుతాయో అని సినీజనాలు గుసగుసలాడుకుంటున్నారు. మరి ఇన్ని మార్పులు 'కాటమరాయుడు'ని సక్సెస్ బాట పట్టిస్తాయో లేదో చూడాలి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

తర్వాతి కథనం
Show comments