Webdunia - Bharat's app for daily news and videos

Install App

యాంకర్ లాస్యతో రహస్య వివాహం చేసినోళ్లకు కృతజ్ఞతలు : రాజ్ తరుణ్

"ఉయ్యాల జంపాల"తో వెండితెరకు పరిచయమైన రాజ్‌ తరుణ్‌ టాలీవుడ్‌ మంచి ఊపుమీదున్న కుర్ర హీరోల్లో ఒకరు. ఈ యువ హీరో వరుస చిత్రాల్లో నటిస్తూ.. మంచి హిట్లను తన ఖాతాలో వేసుకుంటున్నాడు. అయితే, రాజ్ తరుణ్‌ యాంకర్

Webdunia
ఆదివారం, 25 సెప్టెంబరు 2016 (15:14 IST)
"ఉయ్యాల జంపాల"తో వెండితెరకు పరిచయమైన రాజ్‌ తరుణ్‌ టాలీవుడ్‌ మంచి ఊపుమీదున్న కుర్ర హీరోల్లో ఒకరు. ఈ యువ హీరో వరుస చిత్రాల్లో నటిస్తూ.. మంచి హిట్లను తన ఖాతాలో వేసుకుంటున్నాడు. అయితే, రాజ్ తరుణ్‌ యాంకర్ లాస్యను లేపుకెళ్లి రహస్య వివాహం చేసుకున్నట్టు వార్తలు హల్‌చల్ చేశాయి. 
 
దీనిపై ఆ యువకథానాయకుడు స్పందించాడు. ‘నా పెళ్లి చేసిన మిత్రులందరికీ కృతజజ్ఞతలు’ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. అతడు ట్విట్టర్ వేదిక లాస్యతో పెళ్లి పుకారు గురించి పెదవి విప్పాడు. తాను లాస్యను పెళ్లి చేసుకోలేదని స్పష్టం చేశాడు. "కుమారి 21ఎఫ్" సినిమా ఆడియో వేడుకలో మాత్రమే ఆమెను కలిశానని వెల్లడించాడు. 
 
‘‘నా సంబంధం, నా ప్రమేయం లేకుండా కుమారి 21ఎఫ్ సినిమా ఆడియో వేడుకలో ఒకే ఒక్కసారి కలిసిన లాస్యతో నా పెళ్లి చేసిన కొంత మంది మిత్రులకు నా కృతజజ్ఞతలు’’ అని ట్విట్టర్‌లో క్లారిటీ ఇచ్చాడు రాజ్‌తరుణ్. ‘‘ఇలాంటి వింత, విచిత్రమైన హాస్యాస్పద పుకార్లకు ఎలా స్పందించాలో నాకు తెలియట్లేదు. మరో మూడేళ్ల వరకు నాకు పెళ్లి చేసుకోను. ఇప్పటికైతే నాకు పెళ్లి ఆలోచనే లేదు. అంతకుమించి లేచిపోవాల్సిన అవసరమూ నాకు లేదు. నా పెళ్లి అయినప్పుడు అందరికీ నేనే చెబుతాను’’ అంటూ ట్వీట్ చేశాడు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

తర్వాతి కథనం
Show comments