Webdunia - Bharat's app for daily news and videos

Install App

''వేదాళం'' స్టోరీపై ఫోకస్ పెట్టిన పవన్...నేసన్ కాంబోలో...

పవన్ ప్రస్తుతం డాలీ డైరెక్షన్‌లో కాటమరాయుడు సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. దీని తర్వాత త్రివిక్రమ్ సినిమా పట్టాలెక్కుతుందని అనుకున్నారు. పవన్ త్రివ

Webdunia
బుధవారం, 12 అక్టోబరు 2016 (12:12 IST)
పవన్ ప్రస్తుతం డాలీ డైరెక్షన్‌లో కాటమరాయుడు సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.  ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. దీని తర్వాత త్రివిక్రమ్ సినిమా పట్టాలెక్కుతుందని అనుకున్నారు.  పవన్ త్రివిక్రమ్ సినిమా కంటే ముందుగా జిల్లా డైరెక్టర్ నేసన్‌తో కొత్త ప్రాజెక్టు స్టార్ట్ అయింది. ఈ సినిమాకు సంబందించిన పూజా కార్యక్రమాలు ఈ రోజు (బుధవారం) జరిగాయి.
 
ఈ సినిమా పవన్ కెరీర్లో 23వ చిత్రం. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం నిర్మిస్తున్నాడు. ఈ సినిమా డైరెక్టర్ నేసన్ గతంలో తమిళ స్టార్ హీరో విజయ్‌తో జిల్లా అనే సినిమాను తెరకెక్కించాడు. అజిత్ హీరోగా ''వేదాళం'' స్టోరీపై పవన్ బాగా ఫోకస్ చేసినట్టు తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న ప్రొడ్యూసర్ ఏఎం రత్నం, పవన్‌తో సంప్రదింపులు చేస్తున్నాడట. 
 
ఈ రీమేక్‌ను తాను నిర్మిస్తానని ఆయన ముందుకొచ్చినట్టు కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి. మరోవైపు పవన్ ఇమేజ్‌కు తగ్గట్టుగా స్టోరీలో కాస్త మార్పులు చేర్పులు జరుగుతున్నాయని సినీ వర్గాల సమాచారం. మొత్తానికి ఓవైపు డాలీ, మరోవైపు నేసన్, ఇంకోవైపు త్రివిక్రమ్‌లతో పవన్ బిజీ అన్నమాట.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Amaravati: అమరావతిలో ఎకరం రూ.20కోట్లు...

Indian Student: అమెరికాలో కూడా ఇలాంటి ఆటలా? భారతీయ విద్యార్థి అరెస్ట్

రాత్రి బోయ్ ఫ్రెండ్ ఇంటికి వెళ్లింది, తెల్లారేసరికి శవమై కనబడింది, ఏమైంది?

Madhya Pradesh: ఏకలవ్య స్కూల్ ప్రిన్సిపాల్, లైబ్రేరియన్‌.. ఇద్దరూ జుట్టు పట్టుకుని కొట్టుకున్నారు..(video)

వీడి దుంపతెగ... లైవ్ కాన్సెర్ట్‌లోనే కానిచ్చేశాడు.. (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments