Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్ మరో ప్రాజెక్టు ఓకే.. జనవరి నుంచి రెగ్యులర్ షూటింగ్

Webdunia
ఆదివారం, 20 డిశెంబరు 2020 (14:31 IST)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస ప్రాజెక్టులతో బిజీ అయ్యారు. ఇప్పటికే "వకీల్ సాబ్" చిత్రంలో ఆయన నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగులో బిజీగా గడుపుతున్నారు. ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, బోనీ కపూర్‌లు కలిసి ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ క్రమంలో పవన్ మరికొన్ని ప్రాజెక్టులకు గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చారు. ఇలాంటి వాటిలో మలయాళ మూవీ "అయ్యప్పనుమ్ కోశియుమ్" చిత్రం. 
 
ఇందులో చివ‌రిగా ప్ర‌క‌టించిన 'అయ్య‌ప్ప‌నుమ్ కోశియుమ్‌' సినిమాను ముందుగా ప‌వ‌న్ సెట్స్‌పైకి తీసుకెళ్ల‌డానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేసిన‌ట్లు టాక్‌. సినీ వ‌ర్గాల స‌మాచారం మేర‌కు సోమ‌వారం(డిసెంబ‌ర్ 21)న సినిమాను లాంఛ‌నంగా ప్రారంభిస్తార‌ట‌. జ‌న‌వ‌రి మొద‌టి వారం నుండి సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ ఉంటుంద‌ని అంటున్నారు. సాగ‌ర్ కె.చంద్ర ద‌ర్శ‌క‌త్వంలో సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై సినిమా రూపొంద‌నుంది. 
 
నిజానికి ఈ చిత్రం కంటే ముందుగా హరీశ్ శంకర్ దర్శకత్వంలో మైత్రీ మూవీస్ పతాకంపై నిర్మితంకానున్న చిత్రం, సురేందర్ రెడ్డి - రామ్ తాళ్లూరి చిత్రాలు ప్రారంభంకావాల్సివుంది. కానీ, పవన్ కళ్యాణ్ మాత్రం ముందుగా అయ్యప్పనుమ్ కోశియుమ్ చిత్రాన్ని తెరపైకి తీసుకెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బీటెక్ చేసిన విద్యార్థులు ఎందుకు పనికిరావడంలేదు: ఎమ్మెల్యే కూనంనేని (video)

కొండముచ్చులకు కూల్ కూల్‌గా పుల్ల ఐస్ క్రీమ్‌లు, యువతి ఉదారం (video)

Telangana Cabinet: ఏప్రిల్ 3న తెలంగాణ మంత్రివర్గ విస్తరణ : ఐదుగురు మంత్రులకు స్థానం

ప్రియుడిని పిలిచిన ప్రేయసి: బెడ్ కింద నుంచి బైటకొచ్చిన బోయ్ ఫ్రెండ్ (video)

Chandrababu: జగన్ ఇబ్బంది పెట్టాడు, బాబుకు కృతజ్ఞతలు: ప్రభుత్వ ఉద్యోగి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments