Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్‌ను లెక్చరర్‌గా చూపించనున్న హరీష్ శంకర్

Webdunia
గురువారం, 18 మార్చి 2021 (20:34 IST)
టాలీవుడ్ యువ దర్శకుల్లో ఒకరు హరీష్ శంకర్. పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన "గబ్బర్ సింగ్" చిత్రంలో హరీష్ శంకర్ దశ తిరిగిపోయింది. ఆ తర్వాత ఇండస్ట్రీలో నిలదొక్కున్నారు. ఈ నేపథ్యంలో పవన్ నటించే 28వ చిత్రానికి హరీష్ శంకర్ మరోమారు దర్శకత్వం వహించనున్నారు. 
 
ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించనున్నారు. 'గబ్బర్ సింగ్' సినిమా పవన్ కళ్యాణ్ - హరీష్ శంకర్‌ల కాంబినేషన్‌లో వచ్చి ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఆ సినిమాలో పవన్ కళ్యాణ్‌ని పవర్ పోలీస్ ఆఫీసర్‌గా చూపించాడు.
 
కాగా త్వరలో సెట్స్ మీదకి రాబోతున్న తాజా చిత్రంలో పవర్ స్టార్ లెక్చరర్‌గా కనిపిస్తారని తెలుస్తోంది. ఇప్పటివరకు లెక్చరర్‌గా పవన్ కళ్యాణ్ కనిపించలేదన్న సంగతి తెలిసిందే. అద్భుతమైన క్యారెక్టర్ రాశాడని.. పవన్‌ని కొత్తగా చూపించేందుకు హరీష్ శంకర్ స్క్రిప్ట్ రెడీ చేసుకున్నాడని  సమాచారం. 
 
ఇదిలావుంటే, ఏప్రిల్ 9న పవన్ నటించిన "వకీల్ సాబ్" సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. శృతి హాసన్ గెస్ట్ రోల్‌లో నటించిన ఈ సినిమాలో నివేదా థామస్, అనన్య నాగళ్ళ, అంజలి కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. వేణు శ్రీరాం దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని బోనీకపూర్ సమర్పిస్తుండగా దిల్ రాజు నిర్మించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వామ్మో... జ్యోతి మల్హోత్రా ల్యాప్‌టాప్‌ అంత సమాచారం ఉందా?

క్లాసులు ఎగ్గొడితే వీసా రద్దు: ట్రంప్ ఉద్దేశ్యం ఇండియన్స్‌ను ఇంటికి పంపించడమేనా?!!

Nara Lokesh: మహానాడు వీడియోను షేర్ చేసిన నారా లోకేష్ (video)

కర్నాటకలో ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేల బహిష్కరణ వేటు

Heavy Rains: తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. నైరుతి రుతుపవనాలకు తోడు అల్పపీడనం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

ఎందుకు ప్రతి ఒక్కరూ కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది?

ఆరోగ్యానికి మేలు చేసే బఠాణీ, ఎలాగంటే?

చింత చిగురు వచ్చేసింది, తింటే ఏమవుతుంది?

ఆహారంలో చక్కెరను తగ్గిస్తే ఆరోగ్య ఫలితాలు ఇవే

తర్వాతి కథనం
Show comments