Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్ కళ్యాణ్ - త్రివిక్రమ్ చిత్రం టైటిల్ 'అజ్ఞాతవాసి'?

హీరో పవన్ కళ్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి ఇంజనీర్ బాబు అనే టైటిల్‌ను ఖరారు చేసినట్టు వార్తలు వచ్చాయి. అయితే, ఇపుడు మరో టైటిల్ హల్‌చల్ చేస్తోంది.

Webdunia
సోమవారం, 4 సెప్టెంబరు 2017 (09:13 IST)
హీరో పవన్ కళ్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి ఇంజనీర్ బాబు అనే టైటిల్‌ను ఖరారు చేసినట్టు వార్తలు వచ్చాయి. అయితే, ఇపుడు మరో టైటిల్ హల్‌చల్ చేస్తోంది. ఆ టైటిల్ పేరు "అజ్ఞాతవాసి". 
 
పవన్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన సినిమా నుంచి కాన్సెప్ట్ పోస్టర్ ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టర్ లో పవన్ దీర్ఘాలోచన చేస్తూ .. శూన్యంలోకి నడుస్తున్నట్టుగా కనిపిస్తున్నాడు. ఏదో విషయంగా ఆయనలో అంతర్మథనం జరుగుతున్నట్టుగా అనిపిస్తోంది.
 
ఈ నేపథ్యంలో, కథ ప్రకారం ఈ సినిమాకి 'అజ్ఞాతవాసి' అనే టైటిల్‌ను ఎంపిక చేసినట్టుగా సోషల్ మీడియాలోనూ.. ఫ్యాన్స్ గ్రూపుల్లోను ఒక వార్త చక్కర్లు కొడుతోంది. అయితే ఇది కేవలం ఊహాగానాల్లో నుంచి పుట్టిందా?.. లేదంటే నిజంగానే ఆ దిశగా ఆలోచనలు నడుస్తున్నాయా? అనే విషయంలో స్పష్టత రావలసి వుంది. 
 
కాగా, ఈ చిత్రంలో కీర్తి సురేష్, అనూ ఇమ్మాన్యుయేల్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. యువ సంగీత దర్శకుడు అనిరుద్ సంగీత బాణీలు సమకూర్చుతున్నారు. ఈ చిత్రంలోని ఓ పాటను బాణీలను కూడా పవన్ కల్యాణ్ బర్త్‌డే సందర్భంగా రిలీజ్ చేసిన విషయం తెల్సిందే. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

అక్కకి పెళ్లైందని బావ ఇంటికెళితే... మరదలిపై 7 ఏళ్లుగా అత్యాచారం

ప్రపంచంలోనే ప్రమాదకరమైంది కింగ్ కోబ్రా కాదు.. నత్త.. తెలుసా?

ఈ మోనాలిసాకి ఏమైంది? కన్నీటి పర్యంతమై కనిపిస్తోంది (video)

వాట్సప్ ద్వారా వడ్లు అమ్ముకుంటున్న ఆంధ్ర రైతులు, గంటల్లోనే డబ్బు

అనంత్ అంబానీ 141 కిలోమీటర్లు కాలినడకన ద్వారక చేరుకుంటారా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments