Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్‌తో త్రివిక్రమ్ సినిమా... ఈ వార్త నిజమేనా?

Webdunia
సోమవారం, 6 జనవరి 2020 (15:22 IST)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్... రాజకీయాల్లో బిజీగా ఉన్నప్పటికీ.. మరోవైపు సినిమాల్లో నటించేందుకు ఒకే చెప్పారని వార్తలు వస్తున్నాయి. పవన్ రీఎంట్రీ మూవీని దిల్ రాజు నిర్మించనున్నారు. బాలీవుడ్‌లో, కోలీవుడ్‌లో సక్సెస్ సాధించిన పింక్ రీమేక్‌ను పవన్‌తో చేసేందుకు దిల్ రాజు ప్లాన్ చేస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పైన రూపొందే ఈ చిత్రానికి ఎంసీఏ దర్శకుడు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించనున్నారు. 
 
ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. అతి త్వరలో ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత విభిన్న కథా చిత్రాల దర్శకుడు క్రిష్‌తో పవన్ సినిమా ఉంటుందని.. దాదాపుగా ఈ సినిమా ఖరారైందని టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉంటే... పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమా అంటూ ఓ వార్త బయటకు వచ్చింది. 
 
పవన్ - త్రివిక్రమ్ కలిసి జల్సా, అత్తారింటికి దారేది, అజ్ఞాతవాసి సినిమాలు చేసారు. వీరిద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది. అందుచేత మళ్లీ వీరిద్దరు కలిసి సినిమా చేస్తున్నారని వార్త ప్రచారంలోకి వచ్చినప్పటి నుంచి అభిమానుల్లో ఇది నిజమేనా..? కాదా..? అనే ఆసక్తి ఏర్పడింది. ఇంతకీ విషయం ఏంటంటే... పవన్ కళ్యాణ్‌తో దిల్ రాజు నిర్మించనున్న పింక్ రీమేక్‌కి త్రివిక్రమ్ మాటలు అందించనున్నారట.
 
ఇటీవల త్రివిక్రమ్ ఈ విషయంపై చర్చించేందుకు పవన్‌ని కలిసారని ప్రచారం జరుగుతోంది. మరోవైపు అలాంటిది ఏమీ లేదు. పవన్‌తో త్రివిక్రమ్ సినిమా లేదు అని కూడా టాక్ వినిపిస్తోంది. మరి..  ప్రచారంలో ఉన్న ఈ రెండింటిలో ఏది కరెక్ట్ అనేది తెలియాల్సివుంది.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments