ఎన్టీఆర్‌కు బర్త్‌డే గిఫ్టుని సిద్ధం చేసిన రాజమౌళి... ఏంటది?

Webdunia
గురువారం, 14 మే 2020 (10:18 IST)
దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం "ఆర్ఆర్ఆర్" (రౌద్రం - రణం - రుధిరం). జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు హీరోలుగా నటిస్తున్నారు. షూటింగ్ చివరి దశలో ఉంది. కానీ, కరోనా వైరస్, లాక్డౌన్ కారణంగా చిత్ర షూటింగ్ ఆగిపోయింది. 
 
ఇదిలావుంటే, హీరో రామ్ చరణ్ పుట్టిన రోజును పురస్కరించుకుని దర్శకుడు రాజమౌళి అద్భుతమైన బహుమతిని ఇచ్చాడు. మార్చి 27వ తేదీన చెర్రీ తన బర్త్‌డేను జరుపుకున్నాడు. ఆ రోజున "ఆర్ఆర్ఆర్" చిత్రంలో చెర్రీ పోషిస్తున్న అల్లూరి సీతారామరాజు పాత్రకు సంబంధించి ఓ ప్రత్యేక వీడియోను రాజమౌళి విడుదల చేసి ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరిచాడు. దీనికి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. 
 
ఇపుడు జూనియర్ ఎన్టీఆర్ వంతు వచ్చింది. ఈ నెల 20వ తేదీన జూనియర్ పుట్టినరోజు. ఈ బర్త్‌డే రోజున ఎన్టీఆర్ కూడా ఇదే తరహాలో బహుమతి ఇవ్వాలని రాజమౌళితో పాటు.. చిత్ర యూనిట్ ఉంది. 
 
ఈ స్పెషల్ వీడియోలో జూనియర్ ఎన్టీఆర్ "ఆర్ఆర్ఆర్" మూవీలో పోషించే కొమరం భీం పాత్రను పరిచయం చేయనున్నారు. ఇప్పటికే వీడియోను సిద్ధం చేసినట్టు సమాచారం. టీమ్ అంతా కూడా ఈ వీడియో పట్ల సంతృప్తికరంగా ఉందనే టాక్ వినిపిస్తోంది. ఎన్టీఆర్ అభిమానులు ఆశించిన స్థాయిలో ఈ వీడియో ఉంటుందని అంటున్నారు. 
 
ఇకపోతే, ఈ చిత్రం ముందుగా ప్రకటించినట్టుగా జనవరి 8వ తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్రంలో హీరోయిన్లుగా బాలీవుడ్ నటి అలియా భట్, ఒలీవియో మోరిస్‌లు నటిస్తుండగా, ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీత బాణీలు సమకూర్చుతున్నారు. ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య తన సొంత బేనర్ డీవీవీ ప్రొడక్షన్‌పై రూ.250 నుంచి రూ.300 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మొన్న రోడ్లు.. నేడు చెత్త : కరిణ్ మజుందార్ షా

Narayana Murthy: కుల సర్వేలో పాల్గొనేందుకు నిరాకరించిన నారాయణ మూర్తి దంపతులు

అనారోగ్యం ఉందన్న విషయాన్ని దాచి పెళ్లి చేశారని భార్యను హత్య చేసిన భర్త.. ఆర్నెల్ల తర్వాత...

జనవరిలో మరో డీఎస్సీ నోటిఫికేషన్ : మంత్రి నారా లోకేశ్

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు.. ఎగ్జిట్ పోల్స్‌ నిషేధం.. ఈసీ సీరియస్ వార్నింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

హృద్రోగుల్లో అత్యధిక శాతం 50 ఏళ్ల లోపువారే: టాటా ఏఐజీ సర్వేలో వెల్లడి

తర్వాతి కథనం
Show comments