ధనుష్ సర్ అయినా ఒప్పుకోరా?.. మాన్య ఆనంద్‌ను కమిట్మెంట్ అడిగిన మేనేజర్

సెల్వి
బుధవారం, 19 నవంబరు 2025 (11:59 IST)
Manya
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ మేనేజర్ ప్రస్తుతం వార్తల్లో నిలిచాడు. మేనేజర్ శ్రేయాస్ వ్యవహారం వివాదాస్పదంగా మారింది. ప్రముఖ తమిళ టీవీ నటి మాన్య ఆనంద్, శ్రేయాస్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. ఓ కొత్త సినిమా అవకాశం కోసం ఆయన తనను కమిట్‌మెంట్ అడిగాడని మాన్య ఆనంద్ సంచలన ఆరోపణలో చేశారు. 
 
కొత్త సినిమా కోసం తనను సంప్రదించిన అతను సినిమాకు కమిట్‌మెంట్ ఇవ్వాలన్నారని.. ఎలాంటి కమిట్‌మెంట్ అని తాను ప్రశ్నించానని తెలిపింది. సినిమాల కోసం అలాంటి కమిట్మెంట్లను తాను అంగీకరించేది లేదని చెప్పానని మాన్య వెల్లడించింది. అయినప్పటికీ అతను ధనుష్ సర్ అయినా ఒప్పుకోరా? అని అడిగినట్లు మాన్య తెలిపింది.  
 
తాను తిరస్కరించినా శ్రేయాస్ చాలాసార్లు ఫోన్ చేసి వేధించాడని తెలిపింది. నటించడం వరకే తమ పని అని.. దీనికి అవకాశాలు ఇవ్వాలే కానీ ప్రతిఫలం ఆశించకూడదని మాన్య తేల్చి చెప్పింది. ఇండస్ట్రీలో ఈ కల్చర్‌కు ముగింపు పలకాలని మాన్య ఆవేదన వ్యక్తం చేసింది. 
 
ఇదే సినిమా కోసం మరో మేనేజర్ కూడా తనను ఇలాగే సంప్రదించాడని ఆమె వెల్లడించింది. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. దీనిపై ఇప్పటివరకు ధనుష్ బృందం గానీ, మేనేజర్ శ్రేయాస్ గానీ స్పందించలేదు. కాగా.. వానతై పోల అనే తమిళ టీవీ సీరియల్‌తో మాన్య ఆనంద్ బాగా ఫేమస్ అయ్యింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Jagan mohan Reddy: ఈ నెల 20న నాంపల్లి సీబీఐ కోర్టుకు జగన్మోహన్ రెడ్డి

పాకిస్థాన్ ప్రభుత్వమే భారత్‌పై ఉగ్రదాడులు చేయిస్తోంది : ఖైబర్‌పుంఖ్వా సీఎం సొహైల్

మారేడుపల్లి అడవుల్లో మళ్లీ మోగిన తుపాకుల మోత... మావో కార్యదర్శి దేవ్‌జీ హతం

సిడ్నీలో రోడ్డు ప్రమాదం.. రోడ్డు దాటిన 8నెలల గర్భవతి.. భారతీయ మహిళ మృతి

శబరిమలలో భారీ రద్దీ.. స్పృహ కోల్పోయి మృతి చెందిన మహిళా భక్తురాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం