Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Dhanush: వారసత్వానికి సవాల్ గా మారిన ఇడ్లీ కొట్టు ను ధనుష్ ఏం చేశాడు..

Advertiesment
Dhanush, Arun Vijay, Shalini Pandey, Sathyaraj

దేవీ

, మంగళవారం, 23 సెప్టెంబరు 2025 (11:04 IST)
Dhanush, Arun Vijay, Shalini Pandey, Sathyaraj
కుబేర చిత్రం తర్వాత సూపర్ స్టార్ ధనుష్ ఇడ్లీ కొట్టు సినిమాతో అలరించబోతున్నారు. ధనుష్ హీరో, డైరెక్టర్ గా చేస్తున్న ఈ చిత్రాన్ని డాన్ పిక్చర్స్‌, వండర్‌బార్ ఫిల్మ్స్ బ్యానర్స్ పై ఆకాష్ బాస్కరన్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. డైరెక్టర్ గా ధనుష్ కి ఇది నాలుగో మూవీ. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా మేకర్స్  ట్రైలర్ రిలీజ్ చేశారు.
 
తన తండ్రిని ఒప్పిస్తూ, ఇడ్లీ గ్రైండర్‌ కొంటే పని తేలిక అవుతుంది, సమయం కూడా ఆదా అవుతుంది” అని చెప్పే సన్నిశంతో మొదలైన ట్రైలర్ అధంత్యం ఆకట్టుకుంది. ధనుష్‌ ఈ సినిమాలో మురళి పాత్రలో నటిస్తున్నారు. తన తండ్రి దగ్గర ఉన్న సంప్రదాయ ఇడ్లీ కొట్టు మీద మురళికి చాలా అనుబంధం ఉంటుంది. ఆ ఇడ్లీ బండి ఆ ప్రాంతంలో ఉన్న వాళ్లందరికీ చాలా సెంటిమెంట్.  
 
మురళి హోటల్ మేనేజ్‌మెంట్ లోకి వెళ్లి, అరణ్‌ విజయ్‌ చేసిన అశ్విన్ పాత్రతో కలిసి పనిచేస్తాడు. వ్యాపారం లాభాలు పెరగడానికి మురళి సహాయం చేస్తాడు. కానీ అశ్విన్‌ నుంచి వచ్చే బెదిరింపులు మురళి భవిష్యత్తు మాత్రమే కాదు, తన తండ్రి పేరు, వారసత్వానికి సవాల్ గా మారుతాయి. దాంతో మురళి ఎదుర్కోబోయే సవాళ్లు, తన గౌరవం కోసం చేసే పోరాటమే కథలో ప్రధానంగా మారుతుంది.
 
ట్రైలర్ లో ధనుష్‌ పెర్ఫార్మెన్స్, తన పాత్రలో వేరియేషన్స్ ని అద్భుతంగా చూపించారు. నిత్యా మీనన్ నటన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వారి కెమిస్ట్రీ డిఫరెంట్ గా వుంది. అరణ్‌ విజయ్‌, శాలిని పాండే, సత్యరాజ్ పాత్రలు కూడా కీలకంగా వున్నాయి.
 
డైరెక్టర్ గా ధనుష్‌ హార్ట్ టచ్చింగ్ ఎమోషన్ ని అద్భుతంగా ప్రజెంట్ చేశారు. G.V ప్రకాష్ కుమార్ బీజీఎం ఎమోషన్ ని మరింతగా ఎలివేట్ చేసింది. కిరణ్ కౌశిక్ కెమరా వర్క్ బ్రిలియంట్ గా వుంది. డాన్ పిక్చర్స్ & వండర్‌బార్ ఫిల్మ్స్ నిర్మాణ విలువలు ఉన్నంతంగా వున్నాయి. ట్రైలర్ ఇడ్లీ కొట్టు అంచనాలుని మరింతగా పెంచింది.
 శ్రీ వేదక్షర మూవీస్ బ్యానర్ ద్వారా నిర్మాత రామారావు చింతపల్లి తెలుగులో ఈ చిత్రాన్ని గ్రాండ్ గా విడుదల చేయనున్నారు.
  ఇడ్లీ కొట్టు తెలుగు, తమిళ్ లో అక్టోబర్ 1న రిలీజ్ కానుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Sri Vishnu : గన్స్ తో యాక్షన్ చిత్రంతో రాబోతున్న శ్రీ విష్ణు