Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్టీఆర్ బర్త్ డేకి గిఫ్ట్ వస్తుంది... ఇంతకీ ఏంటది..? (Video)

Webdunia
మంగళవారం, 19 మే 2020 (10:27 IST)
యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు మే 20న. చరణ్‌ పుట్టినరోజు నాడు 'ఆర్ఆర్ఆర్' టీమ్ వీడియో రిలీజ్ చేసినట్టుగా ఎన్టీఆర్ పుట్టినరోజు నాడు కూడా 'ఆర్ఆర్ఆర్' టీమ్ వీడియో రిలీజ్ చేస్తుంది అంటూ ప్రచారం జరిగింది. కొన్ని రోజులు ఎన్టీఆర్ బర్త్ డేకి జక్కన్న వీడియో రిలీజ్ చేస్తారని.. కాదు రిలీజ్ చేయలేరని ఇలా వార్తలు వచ్చాయి. ప్రచారంలో ఉన్న ఆ వార్తలకు ఇప్పుడు క్లారిటీ వచ్చేసింది. 
 
యంగ్ టైగర్ ఎన్టీఆర్ క్లారిటీ ఇచ్చేసారు. ఇంతకీ ఏమన్నారంటే... ఈ విపత్తు సమయంలో మీరు మీ కుటుంబ సభ్యులు క్షేమంగా ఉన్నారని భావిస్తున్నాను. పోరాడితే ఈ సమస్య నుండి సురక్షితంగా బయటపడతాం అని నమ్ముతున్నాను.
 
 ప్రతి ఏటా పుట్టినరోజున మీరు చూపించే ప్రేమ, చేసే కార్యక్రమాలు ఒక ఆశీర్వచనంగా భావిస్తాను. ఈ ఏడాది మాత్రం మీరు ఇంటి పట్టునే ఉంటూ, అధికారుల సూచనలను పాటిస్తూ భౌతిక దూరానికి కట్టుబడి ఉండాలని నా విన్నపం. 
 
'ఆర్ఆర్ఆర్' చిత్రం నుండి ఈ సందర్భంగా ఎటువంటి ఫస్ట్ లుక్ లేదా టీజర్ విడుదల కావడం లేదు. అనే విషయం మిమ్మల్ని తీవ్ర నిరాశకు గురిం చేసిందని నేను అర్ధం చేసుకోగలను అంటూ ఎన్టీఆర్ క్లారిటీ ఇచ్చేసారు. 
 
ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఆర్ఆర్ఆర్ టీమ్ నుంచి గిఫ్ట్ రావడం లేదు కానీ.. మరో గిఫ్ట్ వస్తుందని తెలిసింది. 
 
ఏంటా గిఫ్ట్ అంటారా..? ‌ఫల‌క్‌నామా దాస్, హిట్ చిత్రాల‌తో ఆక‌ట్టుకున్న యువ క‌థానాయ‌కుడు విశ్వ‌క్‌సేన్. ఈ యువ హీరో ఎన్టీఆర్ అభిమాని. అందుచేత ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఓ రాప్ సాంగ్ విడుద‌ల చేస్తున్నాడు. 'మాస్ కా దాస్‌, మాస్ కా బాప్‌' పేరుతో సాగే ఈ పాట ఉంటుందని తెలిసింది.

ఎన్టీఆర్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా బుధ‌వారం ఉద‌యం 11 గంట‌ల‌కు విడుద‌ల చేస్తున్నాడు. మరి.. ఈ సాంగ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్‌ని ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.
 
 

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments